TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ప్రభుత్వ టీచర్ కి రూ. 20 వేలు ఫైన్ ఎందుకో తెలుసా..?

Published on: Wed May 26, 2021 9:02AM

పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. చెట్లు మానవ జీవితంలో చాలా ముఖ్యమైనవి అని చెప్పుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం చెట్లను పెంచడానికి ప్రత్యేకమైన కార్యక్రమాన్ని చేపట్టిన విషయం అందరికి తెలిసిందే.. ఈ మధ్య కాలంలో సినీ ప్రముఖులు కూడా చెట్లు నాటండి అని తోటి నటీనటులకు ఛాలెంజ్ చేస్తున్నారు.. ఆ ఛాలెంజ్ తీసుకున్న వాళ్ళు కూడా చెట్లను నాటుతున్నారు. ఇంతకీ ఈ చెట్ల గోల ఏంటని అనుకుంటున్నారా.. మీరే చూడండి. 


కొత్త మంది చెట్లను నాటకపోగా ఉన్న చెట్లను నరికేస్తున్నారు. ఆ నరికేసిన వాళ్ళు ఏ అక్షరం రానివాళ్లు అయితే పరవాలేదు.. బడిలో పిల్లలు పాఠాలు చెప్పాల్సిన టీచర్ చెట్లను నరికాడు.. తెలియనివాడు తప్పు చేస్తే క్షమించొచ్చు.. మరి తప్పు చెయ్యొద్దని బుద్దులు చెప్పే బడి పంతులు ఇలాంటి పనిచేస్తే ఎలా చెప్పండి. 

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం పథకం క్రింద మహాశక్తి నగర్, వీధి నెం. 2 లో 4 ఏళ్ల క్రితం నాటిన గుల్ మొహర్ చెట్టును దొంతి నర్సింహా రెడ్డి అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఎలాంటి అనుమతి లేకుండా నరికివేశారు. దీనిపై హరితాహారం పర్యవేక్షకుడు ఐలయ్య ఇచ్చిన రిపోర్టు ఆధారంగా ఉపాధ్యాయుడిపై కమిషనర్ జరిమానా విధించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రమణాచారి మాట్లడుతూ.. సదరు ఉపాధ్యాయుడు బాధ్యతాయుతమైన వృత్తిలో ఉన్నా ఇలా చేయడం తగదని వ్యాఖ్యానించారు. చెట్ల ప్రాముఖ్యతను విద్యార్థులకు బోధించి వారిని భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాల్సింది పోయి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం ఏంటని ప్రశ్నించారు. ఈ చర్య బాధ్యతారాహిత్యానికి నిదర్శనం అని కమిషనర్ మండిపడ్డారు. దీనికి బదులుగా ఆయనకు ఏకంగా రూ.20 వేల జరిమానా విధించారు. చెట్టును అనుమతి లేకుండా కొట్టేసినందుకు గానూ మున్సిపల్ కమిషనర్ ఈ జరిమానా విధించారు. పర్యావరణ అనుమతి లేకుండా ఈ పని చేసినందుకు గానూ టీచర్ మరో 50 చెట్లు నాటాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.