ముంబాయి లో మరో యువతి ఫై గ్యాంగ్ రేప్
Published on: Sun Dec 23, 2012 11:42AM
.jpg)
ఒక వైపు ఢిల్లీ లో గ్యాంగ్ రేప్ జరిగిన సంఘటనఫై దేశ రాజధానిలో ఆందోళన కార్యక్రమాలు తీవ్ర స్థాయిలో జరుగుతున్న సమయంలో ముంబాయి లో దాదాపు ఇలాంటి సంఘటనే మరొకటి చోటు చేసుకుంది.
భర్తను వెతుక్కుంటూ ఎక్కడో నేపాల్ నుండి వచ్చిన ఓ యువతిఫై స్థానిక వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. పవన్ ఎక్స్ ప్రెస్ లో నేపాల్ నుండి ముంబాయి వచ్చిన ఆ యువతి ముందుగా తన భర్త పని చేసే ప్రాంతానికి వెళ్ళింది. అక్కడ తన భర్త ఆచూకీ తెలియలేదు. దీనితో ఆమె ఈ విషయంలో తన భర్త స్నేహితుడు జుల్ఫీకర్ సహాయం కోరింది. ఆ వ్యక్తి మాత్రం ఆమెను తన ఇంటికి తీసుకు వెళ్లి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అక్కడినుండి ఆమెను లాడ్జీ కి తీసుకువెళ్లగా, మరో ఇద్దరు వ్యక్తులు కూడా ఆమెఫై అత్యాచారం చేశారు.
ఆ యువతి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు జుల్ఫీకర్ తో పాటు మరో వ్యక్తిని అరెస్టు చేశారు. మరో నిందితుని కోసం గాలిస్తున్నారు.


