TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

 ఎన్ ఐ ఎన్ కస్టడీలో ముంబై పేలుళ్ల సూత్రధారి హుస్సేన్ రాణా 

Published on: Fri Apr 11, 2025 1:08PM

 

2008 ముంబై పేలుళ్లకు సూత్రధారి అయిన హుస్సేన్  రాణా ను ప్రస్తుతం  ఎన్ఐఎన్ అధికారులు విచారణ చేస్తున్నారు.   అమెరికా నుండి భారత్ వచ్చిన రాణాను  ఎన్ ఐ ఎన్  అధికారులు  నిన్న అర్దరాత్రి కోర్టులో ప్రవేశ పెట్టారు. 20 రోజుల కస్టడీ కోరుతూ ఎన్ ఐఎన్ కోర్టును  కోరినప్పటికీ    18 రోజుల కస్టడీకి అనుమతించింది.  మొదటి రోజు శుక్రవారం విచారణ ప్రారంభమైంది.  ఈ విచారణ పది రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. హుస్సేన్ రాణా కోసం   ప్రత్యేక ఇంటరాగేషన్ సెల్ ఏర్పాటు చేశారు. ఈ సెల్ లో నే రాణాను విచారణ చేస్తున్నారు. 
 ఇప్పటికే 400 పేజీల చార్జ్ షీట్ ను అధికారులు సిద్దం చేశారు. హుస్సేన్ రాణాతో కలిసి ముంబై లో సీన్ రీ కన్ స్ట్ర  క్షన్  చేసే అవకాశం ఉంది.  పాకిస్తాన్ కు చెందిన హుస్సేన్ రాణా  2008  ముంబై మారణ హోమం   తర్వాత అమెరికా పారి పోయాడు. అమెరికా ఉగ్రవాది డేవిడ్ తో చేతులు కలిపి  ముంబై పేలుళ్లకు పాల్పడ్డారని చార్జ్ షీట్ లో పేర్కొన్నారు.  వీరిరువురు ముంబైలో రెక్కీ నిర్వహించారని నాటి దర్యాప్తులో తేలింది. ముంబై పేలుళ్లలో 24 మంది విదేశీయులు చనిపోయారు. వీరంతా తాజ్ హోటల్ లో బస చేసినప్పుడు ఈ పేలుళ్లు , దాడులు జరిగాయి