రిచెస్ట్ సిటీ ఆఫ్ ఇండియా ఏదో తెలుసా..?
Published on: Sun Feb 26, 2017 12:38PM
.jpg)
న్యూ వరల్డ్ వెల్త్ సంస్థ భారతదేశంలోని అత్యంత ధనిక నగరాల జాబితాను విడుదల చేసింది. ఈ లిస్ట్‌లో రిచెస్ట్ సిటీ ఆఫ్ ఇండియాగా రికార్డుల్లోకి ఎక్కిన నగరం ఏదో తెలుసా..ఇంకేది ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ముంబై. మొత్తం 46,000 మంది మిలియనీర్లు, 28 మంది బిలియనీర్లు ఉన్న ముంబాయి..820 బిలియన్ డాలర్ల సంపదతో రిచెస్ట్ ఇండియన్ సిటీగా నిలిచిందని నివేదిక వెల్లడించింది. ముంబై తర్వాత ఢిల్లీ, బెంగళూరు రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయని న్యూ వరల్డ్ వెల్త్ ప్రకటించింది. కాగా, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ 310 బిలియన్ డాలర్ల సంపదతో నాలుగో స్థానంలో నిలిచింది. 9 వేల మంది మిలియనీర్లు, ఆరుగురు బిలియనీర్లతో భాగ్యనగరం విలసిల్లుతోంది. మూడో స్థానంలో ఉన్న బెంగళూరులోని మిలియనీర్లతో పోలిస్తే హైదరాబాద్‌లో 1,300 మంది అధికంగా ఉండటం విశేషం.


