TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ముంబయిలో కూలిన భవనం

Published on: Fri Sep 27, 2013 9:19AM

 

ఈ రోజు ఉదయం ముంబయిలో భారీ ప్రమాదం జరిగింది తెల్లవారుజామున 6.25గంటలకు డాక్‌యార్డ్‌ రోడ్‌ సమీపంలోని అయిదు అంతస్తుల భవనం కుప్పకూలింది. అయితే ప్రమాదంలో ఎంత మంది గాయపడ్డారు ఎంత మంది మరణించారు అన్నవిషయం ఇంక తెలియలేదు.. శిథిలాల కింద చాలా మంది ఉండవచ్చని అనుమానిస్తున్నారు. పది బృందాలతో శిథిలాల తొలగింపు చర్యలు చేపట్టారు.

ఇప్పటికే పలువురిని కాపాడిన సిబ్బంది చికిత్స నిమిత్తం జేజే ఆసుపత్రికి తరలించారు. ఈ ఏడాదిలో ఇలాంటి ఘటనలు ముంబయిలో మూడు జరిగాయి. ఏప్రిల్‌ 4న ఏడంస్థుల భవనం కూలి 76 మంది చనిపోగా, జూన్‌ 10న జరిగిన మరో ప్రమాదంలో 10 మంది మరణించారు.