అమితాబ్‌కు శస్తచ్రికిత్స సక్సెస్
Published on: Sun Feb 12, 2012 9:27AM
ముంబ
యి: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌కు శనివారం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పొత్తికడుపు ఆపరేషన్ విజయవంతంగా జరిగిందని, ఆయన రెండు మూడు రోజుల్లో ఆస్పత్రినుంచి డిశ్చార్జి అవుతారని అమితాబ్ కుమారుడు, సినీ నటుడు అభిషేక్ బచ్చన్ చెప్పారు. 1982లో కూలీ సినిమా షూటింగ్ సందర్భంగా తీవ్రంగా గాయపడినప్పటినుంచి అమితాబ్ పొత్తికడుపు సమస్యలతో తరచూ బాధపడుతున్న విషయం తెలసిందే. అమితాబ్‌ను నగర శివార్లలోని సెవెన్ హిల్స్ ఆస్పత్రిలో ఆపరేషన్ చేసారు. అమితాబ్ శరీరంలో ప్రధాన వ్యవస్థలన్నీ చక్కగా పని చేస్తున్నాయని, ఆపరేషన్ థియేటర్లోకి వెళ్లే ముందు సైతం ఆయన ఎంతో ఉల్లాసంగా ఉన్నారని, ఆస్పత్రిఆవరణలోనే ఉన్న ఆలయాన్ని సైతం సందర్శించారని ఆస్పత్రి ప్రతినిధి డాక్టర్ ఆస్థానా తెలిపారు. ఆపరేషన్ రెండు మూడు గంటల్లోనే పూర్తయిందని, ఆయన ఆరోగ్యం బాగుందని అభిషేక్ చెప్పారు. అమితాబ్‌కు జరిగింది చిన్న ఆపరేషన్ అని ఆయన చెప్తూ, ఈ రోజంతా ఆయన డాక్టర్ల పర్యవేక్షణలో ఉంటారని, అన్నీ బాగుంటే రెండు మూడు రోజుల్లోనే ఆస్పత్రినుంచి డిశ్చార్జి అవుతారని అభిషేక్ తెలిపారు. అమితాబ్ ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్న, ప్రార్థనలు జరిపిన వేలాది మంది అభిమానులకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసారు.


