TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

భయంతోనే ముల్లై వివాదం తెరపైకి: చిదంబరం

Published on: Sun Dec 18, 2011 1:01PM

కేరళ: కేరళ ప్రభుత్వానికి ఉప ఎన్నికల భయం పట్టుకుందని, అందుకే తెరపైకి ముల్లై పెరియార్ డ్యామ్ వివాదాన్ని తెరపైకి తెచ్చిందని కేంద్ర హోంశాఖామంత్రి చిదంబరం ఆరోపించారు. ప్రస్తుతం ఈ డ్యామ్‌పై కేరళ లేవనెత్తున్న సందేహాలకు ప్రధాన కారణం ఉప ఎన్నికల నోటిఫికేషన్‌ను ఎన్నికల సంఘం విడుదల చేయడమేనన్నారు.ఈ ముల్లై పెరియార్ ఆనకట్ట భద్రత విషయంలో కేరళ అనవసరంగా ఆందోళన చెందుతోందన్నారు. కేరళలోని పిరవోమ్‌ అసెంబ్లీకి త్వరలో ఉప ఎన్నిక జరగనుందని, ఈ ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఓడిపోయే సంకేతాలు ఉన్నాయన్నారు. అందుకే ముల్లై పెరియార్ డ్యామ్ వివాదాన్ని తెరపైకి తెచ్చిందని వ్యాఖ్యానించారు.