TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

ములాయం ఫొటోపై మంత్రి ఫైర్.. ఇక్కడినుండి తీసేయండి..

Published on: Fri Mar 24, 2017 10:50AM

 

ప్రస్తుతం యూపీలో బీజేపీ అధికారం చేపట్టిన సంగతి తెలిసిందే. మరి అలాంటప్పుడు వారికి కేటాయించిన కార్యాలయంలో గత ప్రభుత్వానికి చెందిన వారి ఫొటోలు ఉంటే వారికి ఎలా ఉంటుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితే ఎదురైంది మంత్రి మోహ్‌సిన్‌ రజా కి. మంత్రి మోహ్‌సిన్‌ రజా తన కార్యాలయంలో ఎస్పీ నేత ములాయం సింగ్‌ ఫొటో చూసి అగ్గిమీద గుగ్గిలమయ్యారు. రజా  తన కార్యాలయంలోకి అడుగుపెట్టగానే ములాయంసింగ్‌, ఆజాంఖాన్‌ ఫొటో గోడకు తగిలించి ఉండడాన్ని చూసి  వీరి ఫోటో ఇక్కడెందుకు పెట్టారంటూ అధికారులపై కేకలేశారు. ఆ ఫొటోలని తీయాలని ఎవరూ చెప్పకపోవడంతో అలాగే ఉంచేశామని అధికారులు సమాధానమివ్వడంతో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇప్పుడు ఎవరి ప్రభుత్వం పాలనలో ఉందో తెలుసా? వెంటనే ఈ ఫొటో ఇక్కడి నుంచి తీసేయండి’ అంటూ వారిని గదమాయించారు. దీంతో అధికారులు వెంటనే అక్కడినుండి ఫొటో తొలగించారు.