ముగిసిన ములాయం అంత్య‌క్రియ‌లు

posted on: Oct 11, 2022 4:24PM

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఇటావా జిల్లా సైఫాయి గ్రామంలో రాజ‌కీయ నాయ కులు, కుటుంబ‌స‌భ్యుల న‌డుమ  ప్ర‌భు త్వ లాంఛనాల‌తో  స‌మాజ్‌వాది పార్టీ అధినేత‌, మాజీ ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిములాయం సింగ్ యాద‌వ్‌ అంత్య‌క్రియ‌లు జ‌రిగాయి. ములాయం పార్ధివ దేహానికి ఆయ‌న కుమారుడు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య మంత్రి అఖిలేష్ యాద‌వ్ చితిపెట్టారు. అంత‌కు ముందు, ఆయ‌న స్వ‌గ్రామం సైఫాయికి తీసుకు రాగానే పార్టీ నాయ‌కులు, పార్టీ అభిమానులు అనేక‌మంది నేతాజీ అమ‌ర్‌హై అంటూ మిన్నంటే నినాదా లు చేశారు. ములాయం (82) గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ ప‌డుతూ సోమ‌వారం మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. తెలంగాణా ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, ఆయ‌న కుమార్తె  క‌విత‌, తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు, ప‌లురాష్ట్రాల నాయ‌కులు సైఫాయికి త‌ర‌లివెళ్లి ములాయం కు ఘ‌న నివాళులు అర్పించారు. 

ములాయం పార్ధివ దేహాన్నిఉద‌యం ప‌దింటి నుంచే భారీ ప్ర‌ద‌ర్శ‌న‌తో మేలా గ్రౌండ్ ప్రాంగ‌ణానికి మ‌ధ్యాన్నం ఒంటిగంట స‌మ‌యానికి తీసుకువ‌చ్చారు.  సైఫాయి గ్రామ‌మంతా నేతాజీ అమ‌ర్ హై నినాదాల‌తో మిన్నంటింది. దేశంలో దాదాపు అన్ని ప్రాంతాల నుంచి ములాయం అభిమానులు చివ‌రి చూపు కోసం వాహ‌నాల్లో పెద్ద సంఖ్య‌లో త‌ర‌లివ‌చ్చారు. ములాయం కుమారుడు అఖిలేష్ యాద‌వ్‌, ములాయం సోదరుడు శివ‌పాల్ యాద‌వ్ ఇత‌ర కుటుంబ‌స‌భ్యులు ములాయం శ‌వ‌పేటిక‌తో ఉన్న ట్ర‌క్‌లో మేలా గ్రౌండ్‌కి చేరుకున్నారు. వేలాది మంది అభిమానులు  భారీ నినాదాల‌తో త‌మ ప్రియ‌త‌మ నాయకు నికి అశృనివాళి  అర్పించారు. సైఫాయి మేలా గ్రౌండ్ ద‌హ‌న వేదిక వ‌ద్ద‌కు చంద్ర‌బాబు, బీజేపీ నేత రీటా బ‌హుగుణా జోషీ త‌దిత‌ర నేత‌లు వ‌చ్చారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...