కాంగ్రెస్ నేతకి తీవ్ర అస్వస్థత....చికిత్స ఆపేసిన వైద్యులు

 

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు చెబుతున్నారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన కొన్నాళ్లుగా అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ప్రస్తుతం ఆయన శరీరం చికిత్సకు సహకరించడం లేదని అందుకే ఆయన ఆరోగ్యం మరింత క్షీణించిందని అంటున్నారు. దీంతో ప్రస్తుతం ఆయనకు అందిస్తున్న చికిత్సను నిలిపివేసినట్టు సమాచారం. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ముఖేష్ గౌడ్ మంత్రిగా పనిచేశారు. 

ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో గోషా మహల్ నుంచి పోటీ చేశారు. ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఆయన స్ట్రెచర్ మీద వచ్చారు. అప్పుడే బక్కచిక్కిపోయి కనిపించారు. గత ఎన్నికల్లో ఆయన గెలుస్తానని ధీమాగా ఉన్నారు కానీ ఓటమి పలకరించడంతో ఆయన అప్పటి రాజకీయాలకు దూరంగా విశ్రాంతి తీసుకుంటున్నారు.  ట్రీట్ మెంట్ కు ముకేశ్ గౌడ్ శరీరం సహకరించపోవడంతో చికిత్స ఆపివేసినట్టు అపోలో డాక్టర్లు చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు,సన్నిహితుల్లో ఆందోళన నెలకొంది.