TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కవలలకు తాత అయిన ముఖేష్ అంబానీ

Published on: Sun Nov 20, 2022 10:43PM

వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీ కవల పిల్లలకు తాతయ్యారు. ఆయన కుమార్తె ఈశా అంబానీ శనివారం (నవంబర్ 19)   కవలలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని అంబానీ కుటుంబం ఒక ప్రకటనలో తెలిపింది.  

ఈశా అంబానీ – ఆనంద్ పిరమాల్ దంపతులకు కవలలు జన్మనిచ్చినట్టు పేర్కొంది. కవలలలో   పాపకు అదియా, బాబుకి కృష్ణ అని పేర్లు పెట్టినట్లు ఆ ప్రకటన తెలిపింది. ఆ దంపతులకు, పిల్లలకు మీ ఆశీస్సులు అందించాలని కోరుతున్నామని అంబానీ కుటుంబం ఆ ప్రకటనలో పేర్కొంది.

కాగా.. ఈశా-ఆనంద్ లు చిన్ననాటి స్నేహితులు. వారి స్నేహం ప్రేమగా మారడంతో ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పంచి 2018 డిసెంబరులో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఈశా రిలయన్స్ రిటైల్ వ్యాపారాలను చూసుకుంటున్న సంగతి విదితమే.