జగన్ యూటర్న్.. ముద్రగడ ఫైర్

మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడి విమర్శలు మూటగట్టుకున్న జగన్.. తాజాగా సున్నిత అంశమైన కాపు రిజర్వేషన్లు గురించి మాట్లాడి మరోసారి విమర్శలు పాలయ్యారు.. కాపు రిజర్వేషన్లు ఇవ్వలేనన్న జగన్, రిజర్వేషన్లు కేంద్ర పరిధిలోని అంశం అని అన్నారు.. దీనిపై స్పందించిన కాపు ఉద్యమనేత ముద్రగడ జగన్ మీద తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

 

 

చంద్రబాబు రిజర్వేషన్లు కల్పించే ప్రయత్నం చేస్తున్నారని, దాన్ని జగన్ అడ్డుకుంటున్నారని అన్నారు.. కాపు రిజర్వేషన్ల అంశంపై జగన్ యూటర్న్ తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. అసలు మొత్తం రిజర్వేషన్లకు వ్యతిరేకమా లేక కాపు రిజర్వేషన్లకేనా చెప్పాలని డిమాండ్ చేశారు.. తమను జగన్ అవమానించారని, వచ్చే ఎన్నికల్లో కాపులను ఓట్లు అడిగే అర్హతను కోల్పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. తమకు అండగా నిలిచేవారికే మద్దతిస్తామని ముద్రగడ స్పష్టం చేశారు.. అదే విధంగా ముఖ్యమంత్రి పదవి పొందేందుకు అలవి కాని హామీల్ని జగన్ ఇస్తున్నారని విమర్శించారు.. జగన్ ఇచ్చే హామీల్ని అమలు చేయడానికి కేంద్ర బడ్జెట్ సరిపోతుంతా అని ప్రశ్నించారు.