ముద్రగడ వార్నింగ్... ఉద్యమం చేస్తాం..


కాపు నేత ముద్రగడ పద్మనాభం మరోసారి కాపు రిజర్వేషన్లపై స్పందించారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో ఆయన మాట్లాడుతూ, ఈ నెలాఖరులోగా కాపులను బీసీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. లేకపోతే... ఏప్రిల్‌ నుంచి మళ్లీ ఉద్యమం చేపడతామని ఆయన స్పష్టం చేశారు. అయితే ఈ మలిదశ ఉద్యమం రాజకీయంగానా? లేక కులపరంగానా? అన్నది 13 జిల్లాల అధ్యక్షులతో చర్చించి నిర్ణయిస్తామని ఆయన తెలిపారు. కాగా కాపుల రిజర్వేషన్ల బిల్లుకు ఏపీ ప్రభుత్వ ఆమోదం పలికిన సంగతి తెలిసిందే.