పవన్ కళ్యాణ్ ఎవరో నాకు తెలియదు..


కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని వెంకటగిరిలో ఈరోజు పర్యటించిన ఆయన్ని మీడియా పలకరించి.. పవన్ కళ్యాణ్ గురించి అడుగగా..  పవన్ కళ్యాణ్ ఎవరో తనకు తెలియదని, ఆయనతో తనకు పరిచయం లేదని వ్యాఖ్యానించారు. మరి గతంలో కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు కూడా ఇలానే పవన్ కళ్యాణ్ ఎవరో నాకు తెలియదు అని సెటైర్లు వేయగా.. దానిపై స్పందించి..అశోక్ గజపతిరాజు గారికి నేనెవరో తెలియకపోవచ్చు..కానీ ఆయన నాకు తెలుసు అని కౌంటర్ ఇచ్చాడు. మరి ఇప్పుడు ముద్రగడ కూడాపవన్ ఎవరో తెలియదు అని అన్నాడు. దీనిపై పవన్ ఎలా స్పందిస్తాడో చూద్దాం..