ఏంటీ.. టీడీపీలోకి ముద్రగడ?


 

ఏంటీ.. కాపు నేత ముద్రగడ పద్మనాభం టీడీపీలో చేరుతున్నారా..? ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపికి ఇదే అయింది. కాపు రిజర్వేషన్ల విషయంలో ఏపీ ప్రభుత్వంపై... చంద్రబాబు పై గత కొంత కాలంగా ఒకటే విమర్శలు గుప్పిస్తున్న ముద్రగడ టీడీపీలో చేరడం ఏంటబ్బా అని అందరూ చర్చించుకుంటున్నారు.

 

ఇప్పటివరకూ వైసీపీకి కాస్త సపోర్ట్ గా ఉన్నట్టు వ్యవహరించిన ఆయన ప్రస్తుతం వైసీపీ పరిస్థితి బాలేదని భావించి..ఆ పార్టీలో చేరినా ఉపయోగం లేదని.. అందుకే ఆయన టీడీపీ వైపు చూస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం.. రాజ‌మండ్రి వ‌చ్చిన ఆయన టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌, మాజీ మంత్రి, రాజ‌మండ్రి రూర‌ల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రితో మీట్ అవ్వడమే‌. ముద్ర‌గ‌డ వెంట రాజ‌మండ్రి అర్బ‌న్ ఎమ్మెల్యే ఆకుల స‌త్య‌నారాయ‌ణ కూడా ఉన్నారు. దీంతో ఇప్పుడు అందరికీ సందేహాలు తలెత్తుతున్నాయి. వీరిద్దరూ మంచి సన్నిహితులు.. వీరిద్ద‌రు గ‌తంలో టీడీపీలో క‌ల‌సి ప‌నిచేశారు. ఆ అనుబంధంతోనే వీరిద్ద‌రు క‌లిశారా ? లేదా మ‌రుదైనా రాజ‌కీయ చ‌ర్చ‌లు వీరిద్ద‌రి మ‌ధ్య జ‌రిగాయా ? అన్న‌ది ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. అయితే నిన్న‌టి వ‌ర‌కు టీడీపీని, చంద్ర‌బాబును తిట్టి ఆ పార్టీలోకే వెళ్ల‌డం మంచిది కాదు కాబ‌ట్టి ముందుగా కాపుల కోసం సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేసే పార్టీలోకి వెళ‌తాన‌ని చెప్పి ఆ త‌ర్వాత ప‌సుపు కండువా క‌ప్పుకునేలా ముద్ర‌గ‌డ ప్లాన్ చేస్తున్నార‌ట‌. మరి ముద్రగడ చేరాలని చూసినా.. చంద్రబాబు ఆయనను చేర్చుకుంటారా..? అన్నది పెద్ద ప్రశ్న.