పోలీసుల ఆధీనంలో ముద్రగడ నివాసం..
Published on: Fri Feb 5, 2016 10:13AM

కాపులను బీసీల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ ముద్రగడ పద్మనాభం ఆయన భార్యతో కలిసి తమ నివాసంలోనే ఆమరణ దీక్ష చేపట్టారు. దీంతో తూర్పుగోదావరి జిల్లాలోని ముద్రగడ నివాసం దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. ముద్రగడ నివాసంతో పాటు పరిసరాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మరోవైపు ముద్రగడ దంపతులకు వైద్యపరీక్షలు నిర్వహించారు. ముద్రగడ బీపీ 160, షుగర్ లెవల్స్ 178 ఉన్నాయి. ఆయన భార్య బీపీ 180 షుగర్ లెవల్స్ 121 ఉన్నాయి. కాగా ముద్రగడ నివాసంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన కాపు నేతలను పోలీసులు అడ్డుకున్నారు.


