TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ముద్రగడ పద్మనాభం.. జీవిత విశేషాలు..!

Published on: Tue Jul 14, 2026 9:04PM

 

పద్మనాభం మృతి పట్ల తెలుగు రాష్ట్రాల సీఎంలు విచారం..!

ముద్రగడ పద్మనాభం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నాలుగు దశాబ్దాలకు పైగా క్రియాశీలకంగా ఉన్న సీనియర్ నాయకుడు. కాపు సామాజిక వర్గానికి రిజర్వే షన్లు కల్పించాలనే డిమాండ్‌తో సాగిన ఉద్యమాలకు నాయకత్వం వహించడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా విశేష గుర్తింపు పొందారు. రాజకీయ నాయకుడిగానే కాకుండా సామాజిక ఉద్యమకారుడిగా కూడా ఆయన ప్రత్యేక స్థానం సంపాదించారు. ముద్రగడ పద్మనాభం 1953 జనవరి 22న తూర్పు గోదావరి జిల్లా (ప్రస్తుతం కాకినాడ జిల్లా) లోని కిర్లంపూడి గ్రామంలో జన్మించారు.

 ఆయన తండ్రి ముద్రగడ వీర రాఘవరావు రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే. కుటుంబ నేపథ్యం కారణంగా చిన్నప్పటి నుంచే రాజకీయాలపై ఆసక్తి పెరిగింది. గ్రామీణ వాతావరణంలో పెరిగిన ఆయన ప్రజా సమస్యలపై అవగాహన పెంచుకుని రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. యువకుడిగా రాజకీయాల్లోకి వచ్చిన ముద్రగడ పద్మనాభం ప్రజలతో సన్నిహితంగా మెలుగుతూ త్వరగా గుర్తింపు పొందారు.

తండ్రి మరణానంతరం 1977లో ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. 1978లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. జనతా పార్టీ తరఫున ప్రత్తిపాడు నుంచి విజయం సాధించారు. 1982లో తెలుగుదేశం పార్టీలో చేరిన ముద్రగడ.. 1983, 1985, 1989 ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్టీఆర్‌ క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. అనంతరం ఆ పదవితో పాటు టీడీపీకి రాజీనామా చేశారు. 

ప్రజారక్షణ సమితి, తెలుగునాడు పార్టీలను ముద్రగడ పద్మనాభం స్థాపించారు. కాపు ఉద్యమ నేతగా గుర్తింపు పొందిన ఆయన.. 1994లో ఆ సామాజిక వర్గ రిజర్వేషన్ల కోసం దీక్ష చేశారు. 1999లో కాకినాడ లోక్ సభ స్ధానం నుంచి ఎంపీగా గెలుపొందారు. 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు.  2016లో తునిలో కాపు ఐక్య గర్జన సభ నిర్వహించారు. 2024 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు.

 ప్రజా సమ స్యలపై నేరుగా స్పందించే నాయకుడిగా ఆయనకు పేరు వచ్చింది. ముద్రగడ పద్మనాభం పేరు చెప్పగానే కాపు రిజర్వేషన్ల ఉద్యమం గుర్తుకు వస్తుంది. కాపు, బలిజ, ఒంటరి, తెలగ తదితర వర్గాలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించారు. 2016లో తూర్పు గోదావరి జిల్లా తునిలో నిర్వహించిన కాపు గర్జన సభ అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. అనంతరం ముద్రగడ పలు మార్లు నిరాహార దీక్షలు చేపట్టి ఉద్యమాన్ని కొనసా గించారు. ఆయన డిమాండ్ల పై అప్పటి ప్రభుత్వాలు కమిషన్లు ఏర్పాటు చేయడం, హామీలు ఇవ్వడం వంటి చర్యలు చేపట్టాయి. 

అయితే రిజర్వేషన్ల అంశం న్యాయపరమైన, రాజ్యాంగ పరమైన కారణాలతో వివాదాస్పదంగానే కొనసాగింది. తన రాజకీయ జీవితంలో ముద్రగడ పద్మనాభం పలు పార్టీల్లో పనిచేశారు. వివిధ సందర్భాల్లో అధికార, ప్రతిపక్ష ప్రభుత్వాలపై విమర్శలు కూడా చేశారు. రాష్ట్ర రాజకీయ పరిణా మాలపై తన అభిప్రాయా లను బహిరంగంగా వెల్ల డిస్తూ వార్తల్లో నిలిచారు. ముద్రగడ పద్మనాభం సూటి గా మాట్లాడే నాయకుడిగా పేరొందారు. 

ప్రజా సమస్యల విషయంలో రాజీపడరని ఆయన అనుచరులు చెబుతారు. మరోవైపు, ఆయన ఉద్యమాల తీరు, రాజకీయ నిర్ణయాలపై ప్రత్యర్థులు విమర్శలు కూడా చేశారు. అయిన ప్పటికీ కాపు సామాజిక వర్గంలో ప్రభావం కలిగిన నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారు. ముద్రగడ పద్మనాభం కుటుంబంతో కలిసి కాకి నాడ జిల్లా కిర్లంపూడిలో నివసిస్తూ రాజకీయ, సామా జిక కార్యక్రమాల్లో పాల్గొం టుంటారు. ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమవడం ముద్రగడ రాజకీయ శైలిలో ముఖ్య లక్షణంగా చెప్పబడుతుంది.

ముద్రగడ పద్మనాభం మృతి పట్ల తెలుగు రాష్ట్రాల సీఎంలు నివాళులర్పించారు. ఆయన మరణ వార్త విచారం కలిగిందని సీఎం చంద్రబాబు తెలిపారు. ముద్రగడ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుంబు సభ్యులకు సానుభూతి తెలిపారు. ముద్రగడ ఆకస్మిక మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ సంతాపం తెలిపారు. 

నమ్మిన సిద్ధాంతం కోసం రాజీలేని పోరాటం చేసిన నేత ముద్రగడ అని పేర్కొన్నారు. కాపు వర్గాల అభ్యున్నతికి గొప్ప కృషి చేశారన్నారు. ఆయన కుటుంబసభ్యులకు మాజీ సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు. వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముద్రగడ మరణవార్త తనను ఎంతగానో బాధించిందని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా జగన్‌ ట్వీట్‌ చేశారు.