రాయుడు 3డీ ట్వీట్...స్పంచించిన ఎమేస్కే ప్రసాద్


ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కక పోవడంతో అసహనానికి గురైన టీమిండియాకి ఆడాల్సిన తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు ఆ సమయంలో భారత చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ మీద వ్యగ్యాస్త్రాలు విసిరాడు. అయితే అనంతర పరిణామాలతో రాయుడిని స్టాండ్‌ బైగా తీసుకున్నా జట్టులో అవకాశం కల్పించలేదు. తనకి బదులుగా విజయ్ శంకర్‌ను జట్టులోకి తీసుకున్నారు. అంతే కాదు విజయ్ శంకర్ త్రీడీ ప్లేయర్ అంటూ ప్రసాద్ కితాబిచ్చారు. 

బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ రంగాల్లో రాణిస్తాడని అన్నాడు. అయితే.. ఎమ్మెస్కే వ్యాఖ్యలపై వ్యంగాస్త్రాలు సంధించాడు రాయుడు. తానిప్పుడే 3డి కళ్లద్దాలకు ఆర్డర్ చేశానని ట్వీట్ చేశాడు. తాజాగా ఈ ట్వీట్ మీద  స్పందించిన ఎమ్మెస్కే ప్రసాద్‌ జట్టు ఎంపికలో కొన్ని ప్రమాణాలను పాటించాల్సి ఉంటుందని పేర్కోన్నాడు. నిజానికి త్రీడీ ట్వీటే రాయుడి క్రికెట్‌ కెరీర్‌ను‌ కొంపముంచిదనే చెప్పాలి. 

ఆ తర్వాత జరిగిన పరిణామాలతో క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు అంబటి రాయుడు. తాజాగా వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లే భారత జట్టును ప్రకటించిన ఎమ్మెస్కే ప్రసాద్ ఈ విషయం మీద స్పందించాడు. అతని భావోద్వేగాలను అర్ధం చేసుకున్నామని, కానీ క్రికెట్ కి కొన్ని ప్రమాణాలు ఉంటాయి. వాటి ఆధారంగానే జట్టును ఎంపిక చేయాలని పేర్కొన్నారు. ఎమోషనల్‌ అయి తప్పుడు నిర్ణయం తీసుకోలేమని చెప్పిన ఆయన రాయుడు త్రీడీ ట్వీట్‌పై మాకు ద్వేషం, పక్షపాతం లేదు. రాయుడు టీ20ల్లో బాగానే రాణించినా వన్డేల్లో విఫలమయ్యాడని అందుకే అతన్ని స్టాండ్‌బైగా ఎంపిక చేశామని అన్నారు. అయినా సెలక్షన్‌ కమిటీని విమర్శించడం సరికాదని ఎమ్మెస్కే పేర్కొన్నారు.