2014 నాటికి తెలంగాణ ఏర్పాటు:ఎమ్మెస్సార్
Published on: Sat Jan 14, 2012 9:02PM
హైదరాబాద్:ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు 2014 నాటికి రావడం తథ్యమని ఆర్టీసీ ఛైర్మన్ ఎం.సత్యనారాయణ రావు (ఎమ్మెస్సార్) జోస్యం చెప్పారు. ఆయన తన 79వ పుట్టినరోజు వేడుకలను శనివారం జరుపుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014 ఎన్నికల నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటువుతుందని ఆయన జోస్యం చెప్పారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కొందరు పెట్టుబడిదారుల వల్లే తెలంగాణ ఏర్పాటులో జాప్యం చోటు చేసుకుంటుందన్నారు.కాంగ్రెస్ పార్టీకి తాను చేసిన సేవలకు గుర్తింపుగా గవర్నర్ పదవి వస్తుందని అనుకుంటున్నట్టు చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అందిస్తున్న పాలన భేషుగ్గా ఉందన్నారు. ఆర్టీసీ సంస్థ ఆర్థిక పరిస్థితి ఏం బాగోలేదన్నారు.


