TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఊ అంటావా మావా.. ఊ ఊ అంటావా!  వైసీపీ నేతలతో కలిసి ఎమ్మార్వో చిందులు

Published on: Fri Dec 31, 2021 11:37AM

నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. న్యూ ఇయర్ వేడుకల పేరుతో ధూంధామ్ చేస్తున్నారు.  కొవిడ్ రూల్స్ పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. న్యూ ఇయర్ వేడుకల్లొ పాల్గొని వైసిపి నేతలతో కలిసి చిందులేసారు ప్రభుత్వ అధికారి. కొవూరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ముందస్తు న్యూ ఇయర్ వేడుకల్లొ ఈ సంఘటన చోటుచేసుకుంది.

బుచ్చి రెడ్డి పాళెం తహసీల్దారు స్వయంగా అమ్మాయితొ చిందేసి తెగ సంబరాలు చెసుకున్నారు. తహసీల్దారు అయి ఉండి ఇలాంటి పాడు పనులు చేయడం ఏంటని జనాలు దుమ్మొత్తిపోస్తున్నారు. వేడుకలు జరిగె దగ్గరకు స్థానిక ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ముందుగా వచ్చి వారిని పలకరించి వెళ్లడం ఇంకా చర్చకు దారితీసింది.

ఒమైక్రాన్‌ వేరియంట్ విజృంభిస్తున్న తరుణంలో కొత్త సంవత్సర వేడుకలకు నిబంధనలతో కూడిన ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. జనాలెవరు గుంపులుగా ఉండవద్దని సూచించింది. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ పై ప్రత్యేక దృష్టి పెట్టామని, బహిరంగ ప్రదేశాల్లో వేడుకలు పూర్తిగా నిషిద్ధం విధించినట్లు పోలీసులు తెలిపారు. కాని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండల తహశీల్దారే ఇలా చిందులు వేశారు. ఆ వేడుకల్లో వందలాది మంది పాల్గొన్నారు. ఎవరూ మాస్క్ ధరించలేదు. అంతా గుంపులుగుంపులుగా ఉన్నారు. అయినా ఆ కార్యక్రమంలో వైసీపీ నేతలతో కలిసి తహశీల్దార్ చిందులు వేయడం దుమారం రేపుతోంది.