TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఐదంచెల వ్యవస్థకు మంగళం

Published on: Mon Mar 5, 2012 10:03AM

హైదరాబాద్: స్థానిక సంస్థల్లో ఇప్పటి వరకు ఉన్న ఐదెంచెల వ్యవస్థను రద్దుచేసి మూడంచెల వ్యవస్థ అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్దపడుతోంది. గతంలో మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు మండల అధ్యక్షుడిని ఎన్నుకునేవారు. అయితే ఈ విధానానికి స్వస్తిపలికి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మూడంచెల వ్యవస్థను ప్రవేశపెట్టబోతోంది. పంచాయితీ రాజ్ వ్యవస్థలోని ఒక స్థాయి సభ్యుల వ్యవస్థను తొలగించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఈ నేపధ్యంలో ఎంపిటిసిలను రద్దుచేసి గ్రామస్థాయిలో సర్పంచ్ లను ప్రజలు నేరుగా ఎన్నుకున్న తరువాత ఆయా సర్పంచ్ లు మండల అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోకవర్గ వ్యవస్థను పూర్తిగా రద్దుచేసి జిల్లా పరిషత్ అధ్యక్షుల ఎన్నిక ప్రత్యక్షంగా జరుపనుంది. దీనివల్ల పంచాయితీ రాజ్ వ్యవస్థలో సర్పంచ, ఎంపిపి, జెడ్ పి ఛైర్మన్ మాత్రమే ప్రజాప్రతినిధులుగా వ్యవహరిస్తారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ మూడంచెల వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు చేసింది. గ్రామ పంచాయితీల సర్పంచ్ లను ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఎన్నుకునే అవకాశాన్ని రాజ్యాంగంలోని 243సి (5ఎ) అధికరణలో పొందుపరిచారు. కానీ ఇప్పటివరకు ప్రత్యక్ష ఎన్నికలే జరిగాయి. అదేవిధంగా 243సి (5బి) ప్రకారం ప్రజలతో ఎన్నికైన ఎంపిటిసిలు, ఎంపిపిలను ఎన్నుకునే అవకాశం ఉంది. దీంతో ఎంపిటిసిల వ్యవస్థను పూర్తిగా రూపుమాపి 243సి ప్రకారం సర్పంచ్ లను ప్రజలు నేరుగా ఎన్నుకుని ఆయా సర్పంచ్ ల్లో ఒకరిని ఓటింగ్ ద్వారా ఎంపిపిగా ఎన్నుకుంటారు. గతంలో తెలుగుదేశం  ప్రభుత్వం మూడంచెల వ్యవస్థను కొనసాగించింది. తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఐదంచెల వ్యవస్థను ప్రవేశపెట్టింది. కానీ ఐదంచెల వ్యవస్థను ప్రవేశపెట్టింది. కానీ ఐదంచెల వ్యవస్థ ఆశించినంత విధంగా ఫలితాలు ఇవ్వనందున మళ్ళీ మూడంచెల వ్యవస్థకే ప్రస్తుత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.