రాత్రంతా పార్లమెంటు ఆవరణలోనే ఎంపీలు.. తగ్గేదేలే!
Published on: Thu Jul 28, 2022 7:38AM
రాజ్యసభలో సస్పెన్షన్‌కు గురైన ఎంపీలు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద బైఠాయించారు. రాజ్యసభ నుంచి టీఆర్ఎస్ సహా 20 మంది ఎంపీలు సస్పెండైన సంగతి తెలిసిందే. సస్పెన్షన్లపై ఆయా పార్టీలు తీవ్రంగా మండిపడ్డాయి. కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలకు నిరసనగా 48 గంటల నిరసనకు పిలుపునిచ్చారు. అందులో భాగంగా జరిగిన ధర్నాలో టీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పాల్గొన్నారు. రాత్రి పూట కూడా దీక్షను కొనసాగించారు. రాత్రంతా పార్లమెంట్ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం ఎదుటే బైఠాయించారు. రాజ్యసభలో టీఆర్ఎస్ సహా ఇతర విపక్షాలకు చెందిన 20 మంది ఎంపీల సస్పెన్షన్ పై ఆయా పార్టీలు మండిపడ్డాయి.
కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా అందరూ కలిసి 48 గంటల నిరవధిక ధర్నాకు పిలుపునిచ్చారు. అందులో భాగంగా నేటి రాత్రి ధర్నాలో టీఆర్ఎస్ తరఫున ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పాల్గొన్నారు. రాత్రి అంతా విపక్షాల ఎంపీలు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.
విపక్ష ఎంపీలపై అప్రజాస్వామిక సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఉభయ సభల్లో జీఎస్టీ, ధరల పెరుగుదల సహా ప్రజా సమస్యలపై చర్చకు అనుమతించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. అధిక ధరలు, ద్రవ్యోల్బణం, జీఎస్టీ భారాలపై రాజ్యసభలో చర్చకు కేంద్ర ప్రభుత్వం అనుమతించకుడా ప్రశ్నించే పార్టీలను బయటకు వెళ్లగొడుతోందని ఈ సందర్భంగా ఎంపీలు విమర్శించారు.
మొండిగా వ్యవహరిస్తున్న ప్రభుత్వానికి కనువిప్పు కలగాలనే పార్లమెంటు ఆవరణలోనే రాత్రి అంతా బైఠాయించామన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రజా సమస్యలపై చర్చకు అనుమతించాలని డిమాండ్ చేశారు.


