ఎంపీల‌కు ఔట్‌స్టాండింగ్ పార్ల‌మెంటేరియ‌న్ అవార్డులు

 

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే కదా. అయితే ఈ సమావేశాల్లో ఐదుగురు ఎంపీలకు అవార్డులు ప్రకటించారు. గడిచిన ఐదేళ్లకు గాకు ఒక్కో ఏడాదికి.. ఒక్కోక్కరికీ... మొత్తం ఐదుగురు ఎంపీలకు  ఔట్‌స్టాండింగ్ పార్ల‌మెంటేరియ‌న్ అవార్డుల‌ను లోక్‌స‌భ ప్ర‌క‌టించింది. మ‌ణిపూర్ గ‌వ‌ర్న‌ర్‌, ఐదు సార్లు రాజ్య‌స‌భ స‌భ్యురాలు న‌జ్మా హెప్తుల్లా (2103), బీజేపీ లోక్‌స‌భ స‌భ్యుడు హుకుందేవ్ నారాయ‌ణ్ యాద‌వ్‌ (2014), కాంగ్రెస్ నాయ‌కుడు గులాం న‌బీ ఆజాద్ (2015), తృణ‌మూల్ కాంగ్రెస్‌కి చెందిన దినేష్ త్రివేదీ (2016), లోక్ బిజు జ‌న‌తాదళ్‌కి చెందిన ఐదు సార్లు రాజ్య‌స‌భ స‌భ్యుడు భ‌ర్తృహ‌రి మ‌హ‌తాబ్ (2017) లకు ఈ అవార్డులు దక్కాయి. కాగా ఈ అవార్డును 1995 నుంచి అంద‌జేస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు 18 మంది ఎంపీలు ఈ అవార్డును అందుకున్నారు.