TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చిరంజీవి పాత్రలో టీడీపీ ఎంపీ..!!

Published on: Wed Jul 25, 2018 2:02PM

ప్రత్యేక హోదా సహా విభజన హామీలన్నింటినీ నెరవేర్చాలని కోరుతూ తెలుగుదేశం ఎంపీలు పార్లమెంట్ లో తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు.ఈరోజు లోక్‌సభ ప్రారంభం కాగానే ఎంపీలు సభలో నినాదాలు చేశారు. ఏపీకి న్యాయం చేయాలంటూ కోరారు. వారి ఆందోళన నడుమే స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ప్రశ్నోత్తరాలు నిర్వహిస్తున్నారు.

 

 

సభ ప్రారంభానికి ముందు కూడా ఎంపీలు పార్లమెంటులోని గాంధీ విగ్రహం ఎదుట ఆందోళన చేపట్టారు. ఏపీకి న్యాయం చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ‘ప్రత్యేక హోదా.. ఆంధ్రుల హక్కు’ అంటూ నినాదాలు చేశారు.ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం వివిధ వేషధారణలో నిరసన తెలిపే టీడీపీ ఎంపీ శివప్రసాద్ ఈరోజు కూడా అదే రీతిలో నిరసనకు దిగారు. ఉయ్యాలవాడ నర్సింహ వేషధారణలో ఎంపీ గాంధీ విగ్రహం ఎదుట ఆందోళన చేపట్టారు. ‘సై..రా నర్సింహారెడ్డి..నీ పేరే బంగారుకడ్డీ.. నీవేమో పదునైన కత్తి’ అంటూ పాట పాడతూ నిరసన వ్యక్తం చేశారు.