ఎన్టీఆర్ గెటప్ లో హంగామా..


పార్లమెంట్లో ఉభయసభల్లో ఏపీ ప్రత్యేక హోదా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే కదా. అయితే ఇక చిత్తూరు ఎంపీ శివప్రసాద్ ఎప్పుడూ కూడా తన నిరసనను తెలియజేశారు. ఎప్పుడూ వినూత్నంగా నిరసనలు తెలిపే ఎంపీగారు ఈసారి కూడా చాలా వినూత్నంగా తన నిరసనను తెలియజేశారు. ఈసారి ఏకంగా ఎన్టీఆర్ గెటప్ ఆయన నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అని.. ఏపీకి అన్యాయం జరుగుతుందని.. ఎన్టీఆర్ స్టైల్ లోనే చెప్పారు. అశ్చర్యం ఏంటంటే.... వివిధ రాష్ట్రాలకు చెందిన ఎంపీలు కూడా ఎన్టీఆర్ గెట్ అప్ లో వున్న శివప్రసాద్ ని ఆసక్తిగా చూడడం.