TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

రేవంత్ రెడ్డి సడన్ సర్‌ప్రైజ్.. ఆ ఊరంతా పండగే..

Published on: Tue Jul 6, 2021 7:48PM

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బుధవారం బాధ్యతలు స్వీకరించబోతున్నారు ఎంపీ రేవంత్ రెడ్డి. ఇందుకోసం గాంధీభవన్ లో ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వరుస సమావేశాలతో బిజిబిజీగా ఉంటున్నారు రేవంత్ రెడ్డి. మంగళవారం ఆయన సడెన్ సర్ ఫ్రైజ్ ఇచ్చారు. ఎంతో కాలంగా తనతో పాటు ఉంటున్న ప్రధాన అనుచ‌రుడు కాంగ్రెస్ నేత చిలుక మ‌ధుసూద‌న్‌రెడ్డి ఇంట్లో సంద‌డి చేశారు. అబ్దుల్లాపూర్‌మెట్ మండ‌లం అనాజ్‌పూర్‌లోని మ‌ధుసూద‌న్‌రెడ్డి ఇంట్లో తేనీటి విందును రేవంత్‌రెడ్డి స్వీక‌రించారు. మ‌ధుసూద‌న్‌రెడ్డి ఇంట్లో క‌లియ‌తిరిగి కుటుంబ స‌భ్యుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వారి కుమారుల‌తో కొద్దిసేపు కాల‌క్షేపం చేశారు.

రేవంత్ రెడ్డి తమ గ్రామానికి రావడంతో అనాజ్‌పూర్‌ లో పండుగ వాతావరణం కనిపించింది. గ్రామానికి చెందిన ప‌లువురు కాంగ్రెస్ నాయ‌కులు, కార్యక‌ర్తలు రేవంత్‌రెడ్డిని క‌లిసి శుభాకాంక్షలు తెలిపారు. కొందరు రేవంత్ రెడ్డితో సెల్ఫీలు దిగారు. రేవంత్‌రెడ్డి నాయ‌క‌త్వంలో కాంగ్రెస్ పూర్వవైభవం సాధిస్తుంద‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌దుందుభి మోగిస్తుంద‌ని పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు.