గుండు కాదు మోడీ గుండెల మీద గుద్దుదాం! ఆర్మూర్ లో గర్జించిన రేవంత్ రెడ్డి
Published on: Sat Jan 30, 2021 4:57PM
సీఎం కేసీఆర్, ప్రధాని మోడీ ఒడిలో కూర్చుని రైతులను దగా చేస్తున్నారని కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. పసుపు బోర్డు పెడతానన్న బోడ గుండోడు ఏడికి పోయిండని ఎంపీ అర్వింద్‌ను ఉద్దేశించి ఎద్దేవాచేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పసుపు రైతులకు మద్దతుగా చేపట్టిన రాజీవ్ రైతు భరోసా దీక్లలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం కేసీఆర్ ను కడిగిపారేశారు. ఢిల్లీలో రైతుల చస్తున్నా.. పట్టించుకోకుండా రైతు సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకోవడానికి సిగ్గులేదని విమర్శించారు. పసుపు రైతులు ఢిల్లీ వీధుల్లో కదం తొక్కాలని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.
‘‘నీ పేరులోనే ధర్మం ఉంది కానీ చేసేదంతా అధర్మమే. అర్వింద్‌ను గెలిపిస్తే పసుపు బోర్డు తెస్తానన్న బీజేపీ నేత రాంమాధవ్ హామీ ఏమైంది?. అర్వింద్ బాల్య వితంతువుగా మారుతావా?. రైతులతో ఇలాగే వ్యవహరిస్తే నీ రాజకీయ భవిష్యత్తును బొంద పెడతారని రేవంత్ రెడ్డి చెప్పారు. ‘‘ధర్మపురి నువ్వు గుండు కొట్టించుకన్నా పర్వాలేదు. ఎంపీ పదవికి రాజీనామా చేయకున్నా పర్వాలేదు. కానీ.. 20 నెలలైనా పసుపు బోర్డు ఎందుకు తేలేదో చెప్పాలి. పార్లమెంట్లో రైతుల పక్షాన ఎందుకు కొట్లాడటం లేదు.’’ అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పైనా విరుచుకుపడ్డారు రేవంత్ రెడ్డి. బండి సంజయ్.. తొండి సంజయ్ లా మారి అన్ని అబద్దాలే చెబుతున్నారని విమర్శించారు. బండి సంజయ్‌కు నిజామాబాద్ రైతుల గోస కనిపించడం లేదా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మద్దతు ధర ఇస్తున్నందుకే నష్టం వస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అనడం సరికాదన్నారు రేవంత్ . తెలంగాణ వచ్చాక 6358 మంది రైతు ఆత్మహత్యలు చేసుకున్నారు..రైతు బతికుండగా సాయం చేయని కేసీఆర్ చచ్చాక 6 లక్షలు ఇస్తాడట.. ఇలాంటి ముఖ్యమంత్రి ఎక్కడైనా ఉంటారా అని ఆయన ప్రశ్నించారు.ఆర్మూర్ ఎమ్మెల్యే ఎత్తిపోతల్లో ముందుంటారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.


