TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

బీజేపీ నేతల వల్లే ఢిల్లీలో హింస! కేసీఆర్ బీజేపీ దోస్త్ అన్న రేవంత్ 

Published on: Fri Jan 29, 2021 3:29PM

కేంద్రంలోని నరేంద్ర మోడీ, తెలంగాణలో అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వాలను టార్గెట్ చేశారు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి. ఎన్డీఏతో సీఎం కేసీఆర్‌ చీకటి భాగస్వామ్యం చేసుకున్నారని ఆరోపించారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రసంగాన్ని ప్రతిపక్షాలు బహిష్కరిస్తే టీఆర్‌ఎస్‌ హాజరైందన్నారు. ప్రధాని నరేంద్రమోడీ తెచ్చిన చట్టాలకు టీఆర్‌ఎస్‌ ఆమోదం తెలిపిందని విమర్శించారు. వ్యవసాయ చట్టాలను టీఆర్ఎస్ వ్యతిరేకిస్తే .. అసెంబ్లీలో  వెంటనే తీర్మానం చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. 

ఢిల్లీలో మీడియాతో మాట్లాడి రేవంత్ రెడ్డి... రైతు ఉద్యమాన్ని బీజేపీ నేతలు హింసాత్మకం చేశారని ఆరోపించారు. రైతు ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కేంద్రం కుట్ర చేసిందన్నారు ఎంపీ రేవంత్ రెడ్డి. పసుపు బోర్డు విషయంలో నిజామాబాద్‌ రైతులను ఎంపీ అరవింద్ వంచించారని రేవంత్‌ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. శనివారం ఆర్మూరులో రాజీవ్ రైతు భరోసా దీక్ష జరుగుతుందన్నారు.రాంమాధవ్‌ సమక్షంలో ఇచ్చిన పసుపు బోర్డు హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు.