ఇంతకీ కావూరి రాజీనామా చేసినట్టా, చేయనట్టా..?

MP Kavuri, Kavuri Resignation Refuses, Kavuri News Updates Kavuri Latest News, Cong Mp Kavuri,Telugu News1

 

చాలాకాలంగా పార్టీకి వీరవిధేయుడిగా ఉన్న కావూరి, ఈ సారికూడా మంత్రివర్గ విస్తరణలో తనకి స్థానం దక్కకపోవడంపై తీవ్రస్థాయిలో ఆవేదన చెందుతున్నారు. నేను పార్టీ పదవులకే తప్ప మంత్రిపదవికి పనికిరానా.. అంటూ ఆయన సన్నిహితుల దగ్గర తన ఆవేదనను బైటపెట్టుకుంటున్నట్టు తెలుస్తోంది.

తాను కష్టకాలంలో పార్టీకోసం విపరీతంగా శ్రమించానని, ఎన్టీఆర్ తోకూడా తలపడ్డానని, అయినా అధిష్ఠానం తనపై శీతకన్నేసిందని కావూరి బాహాటంగానే అసంతృప్తిని వెళ్లగక్కుతున్నట్టు సమాచారం. పదవి ఇవ్వకపోతే రాజీనామా చేస్తానంటూ అలిగినా కూడా అధిష్ఠానం కావూరి డిమాండ్ ని పట్టించుకోకపోవడం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది.

ఈ సారి మంత్రిపదవులకు అభ్యర్ధుల ఎంపికలో కాంగ్రెస్ అధిష్ఠానం ఆచితూచి వ్యవహరించింది. వ్యాపార వర్గాలకూ, ఉద్యమాల్ని నెత్తినేసుకుని అధిష్ఠానంపై ఒత్తిడి తీసుకురావాలనుకునేవాళ్లకూ మొండిచేయి చూపించింది. ఆఖరికి రాహుల్ కి అత్యంత సన్నిహితులుగా చెప్పుకునేవాళ్లకూ ఈ కారణాలవల్ల మంత్రివర్గంలో స్థానం దక్కలేదు.

రాజీనామా అస్త్రాన్ని సంధిస్తే హై కమాండ్ దిగొస్తుందనుకున్న కావూరి.. నేరుగా పప్పులో కాలేసినట్టే లెక్క. ఆ మాటకొస్తే అసలు రాజీనామా సంగతిని సోనియా అస్సలు పట్టించుకున్న దాఖలాలుకూడా ఎక్కడా కనిపించలేదుకూడా. అహ్మద్ పటేల్ రంగంలోకి దిగి కావూరి బుజ్జగించే ప్రయత్నాలు చేశారని ఢిల్లీ వర్గాలు కోడై కూశాయ్. తర్వాత అసలు ఆ ఊసే వినిపించలేదు. కావూరి తన రాజీనామాని లోక్ సభ స్పీకర్ మీరా నాయర్ కి, సోనియాకి పంపించారన్న ప్రచారం కూడా గట్టిగానే జరిగింది.

అసలు కావూరి రాజీనామా చేశారా లేదా అన్నది ఇప్పుడు చాలామందికి కలుగుతున్న అనుమానం. దాన్ని నివృత్తి చేస్తూ తాను రాజీనామా చేయలేదని కావూరే స్వయంగా తోటి నేతలతో చెప్పారనికూడా ప్రచారం జరుగుతోంది. కానీ.. అసలు ఏం జరిగిందన్న విషయం మాత్రం ఇంకా బైటికి పొక్కడం లేదు. కేంద్ర మంత్రి పదవి దక్కలేదన్న నిరాశలో కూరుకుపోయిన కావూరిని తెలంగాణ, ఆంధ్ర అన్న బేధం లేకుండా ఎంపీలు, మంత్రులు వరసపెట్టి పరామర్శిస్తున్నట్టు సమాచారం.


 గుప్పిస్తూ అటు కాంగ్రెస్ నీ ఇటు బిజెపినీ ముప్పుతిప్పలు పెడుతున్న కేజ్రీవాల్ మీద రెండు పక్షాలనుంచీ అటాక్ మొదలైంది. రాబర్ట్ వాద్రాపై డిఎల్ ఎఫ్ స్కామ్ ఆరోపణలు చేసిన కొద్ది రోజులకే కేజ్రీవాల్.. బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీపై ఆరోపణలు గుప్పించారు. అటు తిరిగీ ఇటు తిరిగీ మొత్తం బరువంతా తిరిగి కేజ్రీవాల్ మీదే పడుతోంది.

కాంగ్రెస్, బిజెపి నేతలు .. కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగా తమపై బురదజల్లుతున్నారంటూ మండిపడుతున్నారు. ఇదేదో స్పాన్సర్ షిప్ వ్యవహారంలా ఉంది తప్ప.. వాస్తవాలు కనిపించడంలేదంటూ కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేజ్రీవాల్ ఆధ్వర్యంలోని ఇండియా ఎగైనెస్ట్ కరప్షన్ సంస్థకి భారీగా విదేశీనిధులు అందాయని, తెరవెనకఉండి చక్రం తిప్పుతున్న గురువులెవరో కేజ్రీవాల్ ని నడిపిస్తున్నారని బిజెపి నేతలు ఆరోపిస్తున్నారు.

భారతీయ జనతాపార్టీ పత్రిక కమల్ సందేశ్ లో ఈ వెర్షన్ ని ముద్రించారుకూడా.. కేజ్రీవాల్ సుపారీ తీసుకుని పనిచేస్తున్నారని,  దీనిపై మన్మోహన్ సింగ్ ప్రభుత్వం దర్యాప్తు జరపాలని బిజెపి నేతలు డిమాండ్ చేస్తున్నారు. కేవలం డబ్బుకోసమే కేజ్రీవాల్ ఇలాంటి పనులు చేస్తున్నారని బిజెపి నేతలు ఆరోపిస్తున్నారు. అన్నాహజారేకి నమ్మకంగా ఉండలేని వ్యక్తి దేశానికి ఎలా నమ్మకంగా సేవలందిచాలనుకుంటున్నాడో తేల్చి చెప్పాలంటూ కేజ్రీవాల్ మీద తారా స్థాయిలో భాజపా నేతలు మండిపడుతున్నారు.