పవన్ కళ్యాణ్ కు ఆ హక్కు ఉంది....

 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల తెలంగాణలో పర్యటించిన సంగతి తెలిసిందే. అయితే పవన్ పర్యటనపై అధికార పార్టీ ఎలాంటి విమర్శలు గప్పించలేదు కానీ.. ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అంతేకాదు ప్రభుత్వంపై ఒక్క విమర్శ కూడా చేయకపోవడంతో ఎక్కడా లేని అనుమానాలు తలెత్తాయి అందరికీ. ఇప్పుడు తాజాగా పవన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసి మరిన్ని అనుమానాలు తెర తీశారు టీఆర్ఎస్ ఎంపీ కవిత. తెలంగాణ సచివాలయానికి వచ్చిన ఆమె.. మీడియాతో మాట్లాడుతూ.... తాను ఎమ్మెల్యేగానా? లేక ఎంపీగా పోటీచేయాలా? అన్నది పార్టీ నిర్ణయిస్తుందన్నారు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లోకి రావడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారని.. వచ్చే సాధారణ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అవుతుందని ఆమె జోస్యం చెప్పారు. పవన్ టూర్ పై కూడా ఆమె స్పందించి... పవన్ కల్యాణ్‌కు తెలంగాణలో పోటీ చేసే హక్కు ఉందని.. అతని భవిష్యత్తును ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. కోదండరామ్ పార్టీ పెట్టబోతున్నారా అని అడిగిన ప్రశ్నకు పార్టీ పెడితే స్వాగతిస్తామని ఆమె వ్యాఖ్యానించారు.