TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

పార్లమెంట్లో నవ్వులు పూయించిన కవిత... ఏపీ అసెంబ్లీనా..?యూపీ అసెంబ్లీనా..?

Published on: Wed Mar 22, 2017 5:48PM

 

పార్లమెంట్ సమావేశాల్లో ఈరోజు తెలంగాణ ఎంపీ కల్వకుంట్ల కవిత నవ్వులు పూయించారు. పార్లమెంట్ సమావేశంలో మాట్లాడిన ఆమె.. ‘ఏపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రసంగం విన్న తర్వాత.. నేను ఏపీ అసెంబ్లీలో ఉన్నానా? అనే భావన కల్గుతోంది. అదేవిధంగా, యోగి ఆదిత్యనాథ్ స్పీచ్ విన్న తర్వాత  నాకు యూపీ అసెంబ్లీలో ఉన్నట్టుగానూ తోస్తోంది’ అని ఆమె అనడంతో లోక్ సభ సభ్యులు పెద్దగా నవ్వేశారు. అంతేకాదు  జైట్లీ గురించి కవిత చేసిన సరదా వ్యాఖ్యలకు ఆయన సైతం నవ్వుకున్నారు. తనకు కేటాయించిన సమయం ముగియడంతో, మరి కొన్ని నిమిషాలు అనుమతి ఇవ్వాలని కవిత కోరింది. అందుకు, ఒకటి లేదా రెండు నిమిషాలు అనుమతిస్తామని సభాపతి  చెప్పారు. అందుకు కవిత స్పందిస్తూ..‘మూడు లేదా నాలుగు నిమిషాలు మాట్లాడే అవకాశం ఇవ్వండి. ఎందుకంటే, జైట్లీజీ బిజీగా ఉన్నారు .. వినిపించుకోవడం లేదు’ అని వ్యాఖ్యానించింది. దీంతో అరుణ్ జైట్లీ తోపాటు సభ్యులందరూ నవ్వుకున్నారు.