అత్యాచారాలకి ఐటమ్ సాంగ్‌లకి మంత్రిగారి లింక్

 

 

 

ఉత్తర ప్రదేశ్‌లో మహిళల మీద అత్యాచారాల పరంపర కొనసాగుతూ వుండటం, దీని మీద దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతూ వుంటడం, అత్యాచారాల విషయంలో సానుభూతి ప్రకటించాల్సిన ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆయన పార్టీ అయిన సమాజ్ వాది పార్టీ నాయకులు విచిత్రమైన వాదనలు చేస్తూ, అత్యాచారాలకు గురవుతున్న వారి పట్ల వెటకారంగా మాట్లాడుతూ టైమ్ పాస్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారికి తోడుగా మరో వ్యక్తి కూడా జత చేరాడు. ఆ వ్యక్తి ఉత్తర ప్రదేశ్‌కి చెందిన వ్యక్తి కాదు. మధ్యప్రదేశ్ హోం మంత్రి బాబూలాల్ గౌర్.

 

అత్యాచారాల మీద ఆయన మాట్లాడుతూ, ఏ ప్రభుత్వమూ అత్యాచారాల్ని నిరోధించలేదని, ఆ ఘటన జరిగిన తరువాతే చర్యలు తీసుకోవడం సాధ్యమవుతుందంటూ వెరైటీ కామెంట్లు చేశారు. అంతేకాకుండా, రేప్ అనేది కొన్నిసార్లు ఒప్పవుంది, కొన్నిసార్లు తప్పువుతుదంటూ వివాదస్పద వాఖ్యలు చేశారు. అత్యాచారం అనేది ఒక సామాజిక నేరమని.. అది స్త్రీ, పురుషులపై ఆధారపడి ఉంటుందన్నారు. పురుషుడు మానసిక సమతుల్యం తప్పినప్పుడే అత్యారానికి పాల్పడతాడని ఆయన ఓ పెద్ద మానసిక శాస్త్రవేత్త తరహాలో పోజిస్తూ విశ్లేషించారు.



దాంతోపాటు మహిళలు కరాటే, జూడో లాంటి స్వీయరక్షణ విద్యలు నేర్చుకోవాలని ఉచిత సలహాయిచ్చారు. సినిమాల్లోని ఐటం నెంబర్ పాటల వల్ల కూడా వతావరణం పాడవుతోందని చెప్పి ఆయన గారు తెగ ఫీలైపోయారు.  సినిమాలు, టీవీల్లోని అంగాంగ ప్రదర్శనలు కూడా అత్యాచారాలకు కారణమవుతున్నాయన్నది సదరు మంత్రిగారు అంటున్నారు. ఇప్పుడు ఈయన చేసిన వ్యాఖ్యల మీద కూడా దేశంలో దుమారం రేగుతోంది.