TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

దొంగ ఓట్లు.. ఓటర్లకు బెదిరింపులు! పెనుగొండలో ఎంపీ మాధవ్ హల్చల్.. 

Published on: Mon Nov 15, 2021 9:38AM

ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ లో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీతో పాటు అనంతపురం జిల్లా పెనుగొండ నగర పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ నేతలు దొంగ ఓట్లు వేయిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. వైసీపీ నేతలు పోలింగ్ కేంద్రాలకు వెళుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు, 

పెనుకొండ నగర పంచాయతీ ఎన్నికల్లో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ హల్‌చల్ చేశారు. అనుచరులను వెంటబెట్టుకొని పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్లి ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు. పెనుకొండ మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి అక్కడికి చేరుకున్నారు. పార్థసారథి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నప్పటికీ ఎంపీ లెక్క చేయకుండా వెళ్తున్నారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే  పార్థసారథిని అడ్డుకున్న పోలీసులు.. గోరంట్ల మాధవ్‌కు మాత్రం రెడ్ కార్పెట్ వేస్తున్నారు. పోలీసుల తీరుపై పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు.