హైద‌రాబాద్ మా అబ్బ సొత్తే : MP అంజ‌న్‌కుమార్‌

Publish Date:Aug 19, 2013

Advertisement


సీమాంద్రలో జ‌రుగుతున్న ఉద్యమం పై ఎంపి అంజ‌న్‌కుమార్ తీవ్ర వ్యాఖ్యల‌తో విరుచుకుప‌డ్డారు. హైదారాబాద్‌ను అభివృద్ది చేశామ‌ని చెప్పుకుంటున్న సీమాంద్రులు ఏం అభివృద్ది చేశారో చూపించాల‌న‌న్నారు. అంతేకాదు సీమాంద్రులే ఇక్కడి సంస్కృతి సాంప్రదాయాల‌ను నాశ‌నం చేశార‌ని తీవ్రంగా విమ‌ర్శించారు.

అస‌లు గొడ‌వ అంతా హైద‌రాబాద్ పైనే జ‌రుగుతుండ‌టంతో ఈ విష‌యం పై కూడా ఆయ‌న తీవ్రంగా స్పందించారు. హైద‌రాబాద్ మా అబ్బ సోత్తే అంటూ సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. హైద‌రాబాద్‌ను సీమాంద్రులు కొంచెం కూడా అభివృద్ది చేయ‌లేద‌న్నారు.
 
 సీమాంధ్రులే  ఇక్కడి సంస్కతిని నాశనం చేశార‌ని విమ‌ర్శించారు,తెలంగాణలో బాంబుల సంస్కతి రావ‌డానికి కార‌ణం కూడా వారే అన్నారు. వారు ఇక్కడ అభివృద్ది చేసింది ఏమి లేద‌న్న ఆయ‌న సీమాంద్రలే ఇక్కడి వ‌చ్చి చాలా అభివృద్ది చెందార‌ని చౌక‌ధ‌ర‌ల‌కే త‌మ భూముల‌ను కాజేశార‌ని విమ‌ర్శించారు.