TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాజస్థాన్, మధ్య ప్రదేశ్ లో బీజేపీ, ఛత్తీస్ గడ్ లో కాంగ్రెస్ ఆధిక్యం

Published on: Sun Dec 3, 2023 7:29AM

రాజస్థాన్ లో  తొలి ఆధిక్యతలు వెలువడ్డాయి. పోలింగ్ ప్రారంభమైన కొద్ది సేపటికే ఆధిక్యతలు వెలువడ్డాయి.

మొత్తం 199 స్థానాలున్న రాజస్థాన్ లో ఇప్పటికి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం బీజేపీ 13 స్థానాలలో, కాంగ్రెస్ 9 స్థానాలలో ఆధిక్యంలో ఉన్నాయి.

అలాగే 230 స్థానాలున్న మధ్య ప్రదేశ్ లో ఇప్పటికి బీజేపీ 9 స్థానాలలోనూ కాంగ్రెస్ రెండు స్థానాలలోనూ ముందంజలో ఉన్నాయి. ఇక 90 స్థానాలున్న ఛత్తీస్ గడ్ లో కాంగ్రెస్ 6 స్థానాలలోనూ, బీజేపీ 2 స్థానాలలోనూ ఆధిక్యతలో ఉన్నాయి.