TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సవాళ్లు, సంక్షోభాలు, సమస్యలను అధిగమిస్తూ ముందడుగు.. చంద్రబాబు

Published on: Fri Jun 12, 2026 1:23PM

గత వైసీపీ ప్రభుత్వం సవాళ్లు, సంక్షోభాలు, సమస్యలను వదిలి వెళ్తే… అన్నింటినీ అధిగమిస్తూ సంక్షేమం – అభివృద్ధి – సుపరిపాలన అందిస్తున్నామనిఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పేర్కొన్నారు.  రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం  రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో  పెట్టిన పోస్టులో.. ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తూ… రాష్ట్ర భవిష్యత్తుకు బాటలు వేస్తున్నామన్నారు.

రెండేళ్ల పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా రాష్ట్రాభివృద్ధిలో అడుగడుగునా సహకరిస్తున్న ప్రధాని నరేంద్ర మోడికీ, కేంద్ర ప్రభుత్వానికీ ప్రజల తరఫున ధన్యవాదాలు చెబుతున్నానని పేర్కొన్నారు. అటు కేంద్ర ప్రభుత్వ సహకారం, ఇటు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భాగస్వామ్యంతో స్వర్ణాంధ్ర దిశగా అడుగులు వేస్తున్నామన్నారు.