టికెట్ రేట్స్ డబుల్..?

నిత్యం ఉరుకులు పరుగుల జీవితం. వారం అంత జాబ్ చేసి. బిజినెస్ వ్యవహారాలు. ఇతర పనులతో టైడ్ అవుతామని. వీకెండ్ కదా.. థియేటర్ కి వెళ్లి కాస్త రిలాక్స్ అవుదామనుకుంటున్నారా.. అయితే ఒక్కసారి ఆలోచించండి..? ఎందుకంటే ఇక పై ప్రేక్షకుల జేబుకు చిల్లు పడనుంది. సినిమా టికెట్ రేట్లు పెరుగనున్నాయి. టికెట్ రేట్లు డబుల్ కానున్నాయి..ఇప్పటికే మధ్య తరగతి ప్రేక్షకులకు ముల్టీప్లెక్సర్ దూరమైయింది. ఇక పై ఈ దెబ్బతో మాస్ థియేటర్లు కూడా సామాన్య ప్రజలకు దూరం కానున్నాయా..? 

లాక్‌డౌన్‌ వల్ల చాలా నష్టపోయాం... పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అయినప్పుడు. తొలి రెండు వారాల్లోనే మొత్తం పెట్టుబడిని రాబట్టుకోవాలి... ఇది జరగాలంటే టికెట్‌ ధరను రూ.300కు పెంచాలి’’ అన్నది నిర్మాతలు, పంపిణీదారుల ప్రతిపాదన. కాగా ఎగ్జిబిటర్ల వాదన భిన్నంగా ఉంది. ‘‘టికెట్‌ ధర రూ.300 పెంచడం సరికాదు. ఇది ప్రేక్షకులకు భారమవుతుంది. ప్రస్తుతం ఉన్న ధరను రూ.200-250 పెంచితే సరిపోతుంది. నిర్మాతలు టికెట్‌ ధర ఎంత పెంచినా కొత్త ధరల ప్రకారమే మా వాటాను నిర్ణయించాలి’’ అంటున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వమే ప్రత్యేకం గా ఉత్తర్వులు జారీ చేస్తోంది. బాహుబలి చిత్రం విడుదలైనపుడు మొదలైన ఈ సంప్రదాయం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ నెల, వచ్చే నెలలో ప్రముఖ హీరోల చిత్రా లు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. 

రాష్ట్రంలో మొత్తం 1200 థియేటర్లు ఉన్నాయి. వీటి లో సుమారుగా 150 వరకూ మల్టీప్లెక్స్‌ స్ర్కీన్లు ఉన్నా యి. మల్టీప్లెక్స్‌లో రూ.200, రూ.150 టికెట్‌ ధరలు ఉన్నాయి. సింగిల్‌ థియేటర్లలో రూ.150, రూ.125 వరకూ ఉన్నాయి. కొన్ని మల్టీప్లెక్స్‌లో టికెట్‌ ధరలు రూ.184, రూ.112గా ఉన్నాయి. కొత్త సినిమాలు విడుదల కానుండటంతో టికెట్‌ ధరలను రూ.300 చేయాల ని పంపిణీదారులు, నిర్మాతలు భావిస్తున్నారు. 

రాష్ట్రంలో మల్టీప్లెక్స్‌లు ఎక్కువగా బడా నిర్మాతల చేతుల్లోనే ఉన్నాయి. ఇక, సింగిల్‌ థియేటర్లు ఎగ్జిబిటర్ల చేతుల్లో ఉన్నా, సినిమాను బట్టి పంపిణీదారులు వారి కి వాటా ఇస్తున్నారు. ఒకరోజు ఆదాయంలో 65 శాతం వాటాను పంపిణీదారులు తీసుకుంటుంగా, మిగిలిన 35 శాతాన్ని ఎగ్జిబిటర్లకు ఇస్తున్నారు. ఎగ్జిబిటర్లకు ఇ చ్చే వాటాను కొత్తగా నిర్ణయించే ధరల ప్రకారం ఇవ్వాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పటికే ఈ విష యం నిర్మాతలు, పంపిణీదారులకు చేరింది.

దీనిపై చర్చించేందుకు హైదరాబాద్‌కు రావాలని ఎగ్జిబిటర్లకు నిర్మాతలు కబురు పంపారు. ఏపీకి విజయవాడలోనే ఫిలిం చాంబర్‌ ఉన్నందున ఇక్కడే మాట్లాడుకుందామని వారికి ఎగ్జిబిటర్లు చెప్పారు. రాష్ట్రంలో ఉన్న ఎగ్జిబిటర్లు విజయవాడలో ఉన్న తెలుగు ఫిలించాంబర్‌లో గురువారం సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. కాగా, కరోనా ప్రభావంతో ఓటీటీకి డిమాండ్‌ పెరిగింది. కొత్త చిత్రాలు ఓటీటీ వేదికపై అందుబాటులో ఉన్నా యి. దీంతో థియేటర్లలో విడుదలయ్యే కొత్త చిత్రాలను నాలుగు, ఐదు వారాల వరకూ ఓటీటీలో విడుదల చేయకూడదని ఎగ్జిబిటర్లు డిమాండ్‌ చేస్తున్నారు. 

లాక్ డౌన్ వల్ల  ప్రజలు చాలా ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. ఉపాధి లేదు. ఉద్యోగాలు కూడా పోయాయి. ఆర్థికంగా మరింత క్రుంగి పోయారు. ఎప్పుడో సినిమా కు వెళ్లి రిలాక్స్  అవుదాం అనుకునే సామాన్య ప్రేక్షలులపై ఈ ప్రభావం ఎలా ఉండబోతుందో చూడాలి. ఇలాంటి  పరిస్థితిలో టికెట్ ధరలు పెంచితే ప్రేక్షకులు సినిమా థియేటర్స్ కి వస్తారా? అనేది ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ పెద్దల ముందు ఉన్న ప్రశ్న అని చెప్పాలి.  కరోనా పరిస్థితిలో వల్ల ఇప్పటికే అనుకున్న స్థాయిలో  ప్రేక్షకులు థియేటర్ కి రావడం లేదు.. ఎప్పుడు టికెట్ రేట్స్ పెంచితే వస్తారా అనేది మరో  ప్రశ్న అని చెప్పాలి. ఇప్పటికే ఓటీటీకి మంచి ఇలాంటి గిరాకీ ఉంది. రాబోయే రోజుల్లో అంత ఓటీటీకి మయం అయిపోయిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి సమయంలో థియేటర్స్  లో మిస్ అయినా సినిమా 3 వీక్స్ లో ప్రైమ్ లోనో , నెట్ఫ్లిక్ లోనో కుటుంబ సభ్యులతో కలిసి కూర్చొని చూడొచ్చని ప్రేక్షకులు ఆలోచిస్తున్నారు..