TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

దువ్వాడ శ్రీను హీరోగా సినిమా తీస్తా.. మాధురి!

Published on: Wed Aug 14, 2024 2:11PM

దువ్వాడ శ్రీనివాస్ హీరోగా ఒక సినిమా తీయాలన్న కోరిక తనకి వుందని, ఎప్పటికైనా దువ్వాడ శ్రీనివాస్ హీరోగా సినిమా తీస్తానని దివ్వెల మాధురి తన ఆకాంక్షని వ్యక్తం చేశారు. నిన్నటి వరకు చచ్చిపోతానంటూ రచ్చరచ్చ చేసిన మాధురి ఇప్పుడు భవిష్యత్తు మీద బోలెడంత ఆశతో మాట్లాడుతున్నారు. ఏ మీడియా సంస్థ అయినా, ఏ చిన్న యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అయినా ఇంటర్వ్యూ అడగటం ఆలస్యం... మేకప్‌తో సహా రెడీ అయిపోతున్నారు. ఆస్పత్రి నుంచి బయటకి వచ్చిన దగ్గర్నుంచీ ఆమె ఇంటర్వ్యూలు ఇవ్వడంలో బిజీగా వున్నారు. ఆ విధంగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె దువ్వాడ శ్రీనివాస్ దగ్గర వున్న మరో ఆర్ట్.ని బయటపెట్టారు. ‘‘దువ్వాడ శ్రీనివాస్ మంచి నటుడు. తనకు సినిమా హీరో కావాలనేది కల. కానీ ఆ కల తీరలేదని ఎప్పుడూ బాధపడుతూ వుంటాడు. నా క్లోజ్ ఫ్రెండ్ కలను తీర్చాలని నేను ఫిక్సయ్యాను. దువ్వాడ శ్రీనివాస్ హీరోగా ఒక సినిమా తీస్తాను. నేనే పెట్టుబడి పెడతాను. దువ్వాడ శ్రీనివాస్‌లోని నటుడిని ఎలివేట్ చేసే మంచి కథతో ఎవరైనా వస్తే నేను సినిమా తీస్తాను’ అని దివ్వెల మాధురి చెప్పారు. ఆ సినిమాలో తాను హీరోయిన్‌గా నటించనని, 33 సంవత్సరాల వయసున్న తాను హీరోయిన్‌గా నటిస్తే బాగుండదని ఆమె అన్నారు.