TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆఫీసరు సినిమా డిస్ట్రిబ్యూటర్ ఆత్మహత్యకు సిద్ధం

Published on: Tue Jun 5, 2018 4:13PM

 

ఒక పెద్ద హీరో సినిమా ఫ్లాప్ అయితే అది ఆ హీరో కెరీర్‌ మీద పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. ‘జయాపజయాలు దైవాధీనాలు. మన పని మనం చేసుకుంటూ పోవాలి’ అని కాస్త వేదాంతాన్ని వల్లించి అతను ఏ యూరప్‌కో జాలీట్రిప్‌కు వెళ్లిపోతాడు. ట్రిప్ నుంచి తిరిగి వచ్చాక ఇంకో సినిమా షూటింగ్‌ మొదలుపెట్టేస్తాడు. ఇక స్టార్ డైరక్టర్‌ పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది. ‘ఈ సినిమా నాకో గుణపాఠం. ఇక మీద ఇలాంటి తప్పులు చేయను’ లాంటి ఓ భారీ ఎమోషనల్‌ డైలాగ్‌ వేసి మరో స్క్రిప్ట్‌తో మరో హీరో వెంట పడతాడు. కానీ సినిమా కొనుక్కొని చేతులు కాల్చుకున్న డిస్ట్రిబ్యూటర్ల బతుకులే చితికిపోతాయి. దానికి ఆఫీసరు సినిమా డిస్ట్రిబ్యూటర్ సుబ్రహ్మణ్యం కేసే ఓ ఉదాహరణ. మొదట సుబ్రహ్మణ్యం ఆఫీసరు సినిమా తీసేందుకు ఫైనాన్స్‌ మాత్రం చేశాడు.

ఆ డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే ‘మేం ఇప్పుడప్పుడే ఇచ్చేది లేదు. కావాలంటే కోర్టుకి పోయి తెచ్చుకో’ అనేశారు సినీపెద్దలు. దాంతో సుబ్రహ్మణ్యం నేరుగా వర్మ దగ్గరకు వెళ్లాడు. జిత్తులమారి వర్మ సంగతి చెప్పేదేముంది. ఇంకో మూడు కోట్లు నువ్వే నాకు ఇవ్వు. ఆంధ్రాలో సినిమా పంపిణీ హక్కులు ఇస్తానని ఎర చూపాడు. దాంతో సుబ్రహ్మణ్యం ఇరుక్కుపోయాడు. ఇప్పుడు ఆఫీసరు అతిపెద్ద ఫ్లాప్‌ అని తేలిపోవడంతో తనకు ఆత్మహత్య తప్ప వేరే దారి లేదని వాపోతున్నాడు. పాపం! హీరోగారి వేదాంతం సుబ్రహ్మణ్యం మీద పనిచేసినట్లు లేదు.