ప్రత్యేక తెలంగాణ చిత్రాలకు 12 నందులు
Published on: Mon Oct 15, 2012 10:28AM
.png)
ఇదివరలో అవార్డు సినిమాలు వేరు, రికార్డులు తిరగరాసే సొమ్ము వసూలు చేసే సినిమాలు వేరుగా ఉండేవి. సదరు నిర్మాత సినిమా సరిగా ఆడనందుకు బాధపడాలో లేదా అవార్డులు వచ్చినందుకు సంతోషించాలా అని మధన పడుతుండే వారు. తెలివిగల హీరో, హీరోయన్ లు జనం మెచ్చితే చాలు అదే అవార్డులు అంటూ స్టేట్మెంట్లు ఇచ్చేవారు. అయితే పరిస్థితులు మారాయి. జనం మెచ్చిన సినిమాలకే అవార్డులిస్తున్నారు. వాటినే నందులు వరించాయి. చిన్న సినిమాలు, సందేశాత్మక చిత్రాలు వర్ధమాన నటీనటులు చేసిన సినిమాలు కథ, కధనం కొత్తగా ఉన్న అవార్డుల జాబితాలో లేకుండా పోయాయి. అయితే వేర్పాటు వాదంతో తెరకెక్కిన సినిమాలు వసూలులో చివర్లో ఉన్నా సమాచార పౌరశాఖల మంత్రిది తెలంగాణ నేపథ్యమే కావడంతో జాతీయ సమగ్రతా చిత్రంగా జైబోలో తెలంగాణ, రాజన్న, పోరుతెలంగాణ, ఇంకెన్నాళ్లు చిత్రాలకు 12 నందులు అందుకోవడానికి కారణం అని విమర్శకులు భావిస్తున్నారు.


