వెంకన్న సాక్షిగా బాబుపై మోత్కుపల్లి విమర్శలు 

 

వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఓటమిని కోరుతూ తిరుమల కొండకు నడక దారిలో చేరుకుంటానని చెప్పిన మోత్కుపల్లి.. అన్నట్టుగానే తిరుమల కొండకు చేరుకున్నారు.. నడక ప్రారంభించడానికి ముందు మరోసారి బాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.. కుల రాజకీయాలు చేసే చంద్రబాబు కారణంగా, టీడీపీలో దళితులంతా దగా పడ్డారన్నారు.. పార్టీలో కష్టపడ్డ ఏ దళితుడికి న్యాయం జరగలేదన్నారు.. కేంద్ర మంత్రి పదవులు, రాజ్యసభ సభ్యులుగా దళితులు పనికిరారా?.. సుజనా, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్ లకు ఏ అర్హత ఉందని ఎంపీ సీట్లు ఇచ్చారని మోత్కుపల్లి ప్రశ్నించారు.. అదే విధంగా బాబును ఓడించేందుకు అన్ని రాజకీయ పార్టీలు ఏకం కావాలని పిలుపునిచ్చారు.. అయితే తిరుమల నడక ప్రయాణంలో మోత్కుపల్లికి బీపీ ఒక్కసారిగా పడిపోయి, అస్వస్థతకు గురయ్యారు.. కారులో కొండకు వెళ్లాలని డాక్టర్లు సూచించినా.. ఆయన మాత్రం తన పట్టుదల వీడకుండా, నడక మార్గంలోనే తిరుమల కొండకు చేరుకున్నారు.