పవన్ తో మోత్కుపల్లి భేటీ.. కారణం అదేనా?

మోత్కుపల్లి నరసింహులు పేరుకి తెలంగాణ నేత అయినా కూడా ఆయన దృష్టి అంతా ఏపీపైనే ఉంది.. మోత్కుపల్లి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటూ టీడీపీ ఆయన్ని పార్టీ నుండి సస్పెండ్ చేసింది.. ఇక అప్పటినుండి మోత్కుపల్లి చంద్రబాబు మీద విమర్శల డోస్ పెంచారు.. చంద్రబాబుని వచ్చే ఎన్నికల్లో ఓడించడమే తన లక్ష్యమని కంకణం కట్టుకొని కూర్చున్నారు.. చంద్రబాబు వ్యతిరేకులు అందరూ తన మిత్రులే అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు.. మొన్నటికి మొన్న చంద్రబాబుకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని చెప్పిన మోత్కుపల్లి.. అదే సమయంలో వైసీపీ నేత విజయ సాయి రెడ్డితో రహస్య భేటీ అయ్యారనే వార్తలు కూడా వినిపించాయి.

 

 

అయితే తాజాగా మోత్కుపల్లి పవన్ కళ్యాణ్ తో భేటీ అయినట్టు తెలుస్తోంది.. దీంతో ఆయన జనసేనలో చేరుతారనే అభిప్రాయం వ్యక్తమైంది.. అయితే ఈ భేటీ గురించి కొందరి అభిప్రాయం మాత్రం వేరేలా ఉంది.. ఆపరేషన్ గరుడలో భాగంగానే మోత్కుపల్లి ఇలా చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.. విజయ్ సాయి రెడ్డి, మోత్కుపల్లి నివాసం వరకు వెళ్లి మీడియాను చూసి వెనుదిరగటం.. మోత్కుపల్లి తెలంగాణ రాజకీయాలు వదిలేసి చంద్రబాబుని టార్గెట్ చేస్తూ ఏపీ రాజకీయాల చుట్టూ తిరగటం.. ఇప్పుడు పవన్ తో భేటీ.. ఇవన్నీ చూస్తుంటే ఆపరేషన్ గరుడలో భాగంగానే మోత్కుపల్లి, చంద్రబాబుని వ్యతిరికేస్తున్న వారిని కలుస్తున్నారని కొందరు ఆరోపిస్తున్నారు.. మరోవైపు బీజేపీ, మోత్కుపల్లికి గవర్నర్ పదవి ఆశ చూపింది.. అందుకే ఆయన స్వంత రాజకీయాలు వదిలేసి చంద్రబాబుకి వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు.. మోత్కుపల్లి భేటీ వెనుక అసలు కారణం ఏంటో తెలిసే వరకు ప్రస్తుతానికైతే ఇవన్నీ ఆరోపణలుగానే మిగిలిపోతాయి.