చంద్రబాబుకి మోత్కుపల్లి సవాల్

 

తెలంగాణలో బాగా పేరున్న తెలుగుదేశం పార్టీ నాయకుల్లో మోత్కుపల్లి కూడా ఒకరు.. కానీ అది ఒక్కప్పటి మాట.. ఎన్టీఆర్ వర్ధంతి రోజు మోత్కుపల్లి, చంద్రబాబు మీద తీవ్ర విమర్శలు చేయడం.. తరువాత పార్టీ నుండి సస్పెండ్ అవ్వడం ఇదంతా తెలిసిందే.. అయితే రీసెంట్ గా మోత్కుపల్లి, చంద్రబాబుకి ఒక సవాల్ విసిరారట.. చంద్రబాబుకి తన అనుభవం, తెలివితేటల మీద నమ్మకం ఉందనుకుంటే.. ఎన్టీఆర్ పెట్టిన టీడీపీకి రాజీనామా చేసి.. కొత్తగా పార్టీ పెట్టి తన సమర్థత నిరూపించుకోవాలంటూ సవాల్ విసిరారు.. ఇది విని కొందరు రాజకీయ విశ్లేషకులు, 'పది సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నా.. వెనకడుగు వేయకుండా పార్టీని నిలబెట్టి అధికారంలోకి తీస్కొచ్చిన నాయకుడు చంద్రబాబు.. మోత్కుపల్లి, కేవలం పదవి దక్కలేదన్న కోపంతో ఇలా బాబు మీద విమర్శలు చేయడం, సవాళ్లు విసరడం కరెక్ట్ కాదని' భావిస్తున్నారట...