ఏపీలో వైసీపీ తరుపున మోత్కుపల్లి ప్రచారం?

 

మోత్కుపల్లి నర్సింహులు, చంద్రబాబు మీద తీవ్ర విమర్శలు చేసి టీడీపీ నుండి సస్పెండైన సంగతి తెల్సిందే..  చంద్రబాబు శత్రువులందరూ మాకు మిత్రులు అన్నట్టుగా వ్యవహరించే వైసీపీ, 2019 ఎన్నికల్లో చంద్రబాబుని అడ్డుకోడానికి మోత్కుపల్లిని కూడా ఒక అస్త్రంగా వాడుకోవాలని చూస్తుందట.. ఇప్పటికే ఆ దిశగా పావులు కూడా కదుపుతున్నట్టు తెలుస్తుంది.. మోత్కుపల్లి, చంద్రబాబు మీద విమర్శలు చేయడంతో పాటు.. చంద్రబాబుకి వ్యతిరేకరంగా వాడవాడల ప్రచారం చేస్తానన్నారు.. ఈ మాటని సీరియస్ గా తీసుకున్న వైసీపీ, మోత్కుపల్లితో చంద్రబాబుకి వ్యతిరేకంగా ప్రచారం చేయించాలని చూస్తుందట.. ఇప్పటికే రంగంలోకి దిగిన విజయ సాయి రెడ్డి ఈ విషయం గురించి మోత్కుపల్లితో చర్చించే పనిలో ఉన్నారట.. మరి మోత్కుపల్లి నిజంగానే ఏపీలో చంద్రబాబుకి వ్యతిరేకంగా వైసీపీ తరుపున ప్రచారం చేస్తారా? లేక ఏపీలో ప్రచారం చేసేకంటే, తెలంగాణలో ఏదైనా పార్టీలో చేరి, సొంత ప్రచారం చేసుకుంటే భవిష్యత్తు బాగుంటుందని ఆగుతారా? చూద్దాం ఏం జరుగుతుందో అంతా కాలమే నిర్ణయిస్తుంది.