మోత్కుపల్లి కాంగ్రెస్ వైపు చూస్తున్నాడా?
Published on: Tue Jan 28, 2014 4:45PM
.jpg)
రాజ్యసభ సీటు దక్కపోవడంతో అసంతృప్తితో ఉన్న సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులును బుజ్జగించడానికి టిడిపి పార్టీ నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించినట్టు కనిపించడం లేదు. మోత్కుపల్లిని సముదాయించేందుకు ఆ పార్టీ సీనియర్ నేతల ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎల్.రమణ, నామా నాగేశ్వర రావు, మహేందర్‌రెడ్డి తదితరులు మోత్కుపల్లి నివాసానికి వచ్చినప్పుడు తన ఆవేదనను నర్సింహులు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
''ఏడాది నుండి నీకె రాజ్యసభ సీటు ఇస్తాను అని చెబుతూ వచ్చాడు. ఇప్పుడు నన్ను మోసం చేశాడు. ఈ పరిస్థితులలో తెలుగుదేశం పార్టీలో ఉండడంకన్నా కట్టెలమ్ముకోవడం మేలు” అని మోత్కుపల్లి వాపోయాడట. మరోవైపు ఆయన కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని రాజకకీయవర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మంత్రి జానారెడ్డి రాయబారం ద్వారా కాంగ్రెస్ లో ప్రవేశించవచ్చని ప్రచారం జరుగుతోంది. అయితే పార్టీ మారే విషయంలో మాత్రం మోత్కుపల్లి ఇంకా నిర్ణయం తీసుకోలేదట.


