TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వికారాబాద్‌లో విషాదం.. ఇద్దరు చిన్నారులను చంపి తల్లి బలవన్మరణం

Published on: Sun Jun 14, 2026 8:34AM

కుటుంబ కలహాలు  మూడు ప్రాణాలను బలితీసుకున్నాయి. ఈ విషాద  ఘటన వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఓ తల్లి తన ఇద్దరు పిల్లల్ని చంపి తాను ఆత్మహత్య చేసుకుంది. చౌడాపూర్ మండలం అడవి వెంకటాపూర్ గ్రామానికి చెందిన   నవనీత అనే వివాహిత తన భర్త,  ఏడేళ్ల  కుమారుడు విగ్నేష్, ఐదేళ్ల కుమార్తె మధుప్రియలతో నివాసం ఉంటుంది. అయితే.. దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండడంతో విసుగు చెందిన నవనీత ముందుగా ఇద్దరు పిల్లలకు ఉరివేసి హత్య చేసి..  అనంతరం తాను కూడా ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నది.

 నవనీత ఆత్మహత్య చేసుకోబోయే ముందు తన ఆత్మహత్య కు ఎవరూ  కారణం కాదని   సూసైడ్ నోట్ లో రాసింది. కుటుంబ కలహాలు, మానసిక ఒత్తిడులే ఈ విషాదానికి కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తు న్నారు.  . మృతదేహాలను పోస్టుమా ర్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులను విచారిస్తూ ఘటన వెనుక ఉన్న అసలు కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.ఒకే ఇంట్లో తల్లి, ఇద్దరు చిన్నారులు మృతిచెందడం తో అడవి వెంకటాపూర్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.