TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కన్నబిడ్డలను కడతేర్చి.. తల్లి ఆత్మహత్య.. హైదరాబా కూకట్‌పల్లిలో దారుణం

Published on: Tue Mar 31, 2026 6:31PM

 

కట్టుకున్న భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న మనస్తాపంతో ఓ తల్లి తన ఇద్దరు పిల్లలను చంపి, ఆపై తాను ఆత్మహత్యకు పాల్పడింది. ఈ దారుణ ఘటన కూకట్ పల్లి కైతలాపూర్ రాఘవేంద్ర కాలనీ జరిగింది. వివరాలిలా ఉన్నాయి.

 తన భర్త ప్రవీణ్ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న ఆవేదనతో   28 ఏళ్ల స్రవంతి తన కుమారులు కార్తిక్ , కౌశిక్ లను హత్య చేసి తానూ ఆత్మహత్యకు పాల్పడింది. ఇందుకు కారణం స్రవంతి భర్త వివాహేతర సంబంధం పెట్టుకుని గత కొంత కాలంగా తనను వేధిస్తుండటమేనని స్థానికుల ద్వారా తెలుస్తోంది.   స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు  ఘటనా స్థలానికి చేరుకు  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.   

ఇదలా ఉండగా స్రవంతి తన కుమారులను చంపి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనతో  వీరి స్వగ్రామమైన వరంగల్ జిల్లా వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం  బోడ మాణిక్యం తండాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.  విషయం తెలియగానే తాండాలో ఉన్న భర్త ప్రవీణ్ ఇంటిని స్రవంతి బంధువులు దగ్ధం చేశారు. 

 స్రవంతిని వివాహం చేసుకున్న ప్రవీణ్ హైదరాబాద్ లో కాపురం పెట్టాడనీ, అయితే మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని స్రవంతిని నిత్యవ వేధించేవాడనీ బంధువులు తెలిపారు.  భర్త వేధింపులు భరించలేక స్రవంతి పుట్టింటికి వచ్చేసిందనీ, అయితే  ప్రవీణ్ ఇక నుంచీ  స్రవంతి ని బాగా చూసుకుంటానని పెద్దల సమక్షంలో హామీ ఇచ్చి ఆమెను కాపురానికి తీసుకెళ్లాడనీ బంధువులు తెలిపారు.  అలా వెళ్లిన స్రవంతి తన పిల్లలతో సహా ఇంట్లో విగతజీవిగా పడి ఉందనీ,   ప్రవీణే   భార్య పిల్లలను హత్య చేశాడని స్రవింతి బంధువులు ఆరోపిస్తున్నారు.  ఇలా ఉండగా స్రవంతి సెల్ఫీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో స్రవంతి భర్త తనను, పిల్లలన హత్య చాకుతో పొడిచి లేదా ఉరేసి చంపేస్తానంటూ బెదరిస్తున్నాడని సోదరుడికి చెప్పుకుంటూ   ఈ వీడియో ఆవేదన వ్యక్తం చేసింది.