TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆ అమ్మ ప్రేమకు ఫిదా కాని వారుంటారా?

Published on: Sun Jul 17, 2022 9:39AM

అమ్మ ప్రేమకు  హద్దులుండవు. అమృతం కూడా అమ్మ ప్రేమ ముందు దిగదుడుపే.. అందుకే అంటారు అమ్మ అని. తన బిడ్డ భద్రత కోసం, క్షేమం  కోసం అమ్మ ఎంతకైనా తెగిస్తుంది. బిడ్డ కోసం ఆ  అమ్మ పడిన  తపన కళ్లు చెమర్చేలా  చేస్తుంది. అయితే  ఆ అమ్మ మనిషి కాదు.. ఓ ఏనుగు. తన పిల్లను  రక్షించుకోవడం  కోసం ఆ  అమ్మ ఏనుగు పడిన తపన, తాపత్రేయం, బాధ, వేదన  మనసును కదిలించేస్తుంది. ఈ సంఘటన థాయ్ ల్యాండ్ లోని నకోన్ నాయక్ప ప్రాంతంలో  జరిగింది. గున్న ఏనుగు ప్రమాద వశాత్తూ గుంతలో పడిపోయింది. ఆ గున్న ఏనుగు తల్లి తన బిడ్డను  రక్షించుకోవడానికి పడిన తపన, తాపత్రేయం ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యింది. నెటిజన్లు ఆ అమ్మ ప్రేమకు 

ఫిదా అవుతున్నారు.  పిల్లను రక్షించుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేసింది.  గుంత చుట్టూ తిరుగుతూ   బిడ్డను ఎలాగైనా కాపాడాలని ప్రయత్నించింది. ఆ ప్రయత్నంలో తీవ్ర ఒత్తిడికి లోనై మూర్ఛిల్లింది. సమాచారం అందుకున్న స్థానిక జూ  అధికారులు అక్కడకు వచ్చి తల్లి ఏనుగుకు మత్తు మందు ఇచ్చారు. ఆ తరువాత గున్న  ఏనుగును గుంత  లోనుంచి బయటకు తీసి  రక్షించారు. స్ఫృహలోకి  వచ్చిన తరువాత తల్లి  ఏనుగు పిల్లతో కలిసి  అడవిలోకి వెళ్లిపోయింది.