TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కుటుంబ కలహాలు.. కొడుకుతో సహా తల్లి ఆత్మహత్య

Published on: Sun Mar 29, 2026 6:45AM

కుటుంబ కలహాల కారణంగా తల్లిదండ్రులు క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలకు చిన్నారులు బలౌతున్న సంఘటనలు ఇటీవల పెచ్చరిల్లాయి.  తాజాగా వరంగల్ జిల్లాలో ఓ తల్లి క్షణికావేశంలో తన రెండేళ్ల కుమారుడిని హత్య చేసి తాను ఆత్మహత్యకు పాల్పడింది. స్టేషన్ ఘన్ పూర్ కు చెందిన కామిండ్ల హరీష్ కు నాలుగు సంవత్సరాల క్రితం కళ్యాణి తో వివాహం జరిగింది...    వీరికి శ్రేయాన్ష్ అనే రెండేళ్ల కుమారుడు ఉన్నాడు.  హరీష్ టిఎస్ఎస్పి లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు.   అయితే ఈ మధ్యకాలంలో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే  తీవ్ర మనస్తాపానికి గురైన కళ్యాణి తన కొడుకుని తీసుకొనివరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట మండలం  కట్ర్యాల గ్రామంలో నివాసం ఉంటున్న తల్లిదండ్రుల వద్దకు  వచ్చింది.  అక్కడకళ్యాణి తన కొడుకుతో సహా ఎస్సారెస్పీ కెనాల్ లో దూకి ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు స్థానికులు ఘటన స్థలానికి చేరుకున్నారు... మృతదేహాల కోసం పోలీసులు గజ ఈతగాళ్ల చేత గాలింపు చర్యలు చేపట్టారు. కుటుంబ వివాదాల వలన కళ్యాణి ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు, స్థానికులు చెబుతున్నారు.  పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.