మోపిదేవిని 5రోజుల సీబీఐ కస్టడీకి న్యాయస్థానం అనుమతి
Published on: Thu May 24, 2012 5:40PM
మోపిదేవిని అయిదు రోజులపాటు సీబీఐ కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది. జగన్ ఆస్తుల కేసులో మోపిదేవి వెంకటరమణను సీబీఐ అధికారులు కొద్దిసేపటి క్రితం కోర్టులో హాజరు పరిచారు. మోపిదేవిని అరెస్ట్ చేసినట్లు స్పీకర్ నాదెండ్ల మనోహర్కు సీబీఐ అధికారులు సమాచారం అందించారు. జగన్ సంస్థలలో పెట్టుబడుల వ్యవహారంలో మోపిదేవిని సీబీఐ ఈరోజు మధ్యాహ్నం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సీబీఐ సెక్షన్ 120బి రెడ్ విత్ 420 కింద మోపిదేవిని అరెస్ట్ చేసింది. సెక్షన్ 477, 420, 409, పీసీ యాక్ట్ 13(2) రెడ్ విత్ 13(1) డి కింద కేసులు నమోదు చేసి సీబీఐ విచారణ కొనసాగిస్తోంది. అందులో భాగంగానే సీబీఐ మోపిన అభియోగాల మేరకు సీబీఐ కోర్ట్ మోపిదేవిని రిమాండ్‌కు పంపించింది.


